సుదీప్ కిచ్చా 'K3' మూవీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

'K3Kotikokkadu' Movie Grand Theatrical Release on 16th Sept. 'రక్త చరిత్ర' మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ హీరో సుదీప్‌ కిచ్చా.. 'ఈగ' మూవీతో తెలుగు అభిమానులకు

By అంజి  Published on  29 Aug 2022 8:32 AM GMT
సుదీప్ కిచ్చా K3 మూవీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

'రక్త చరిత్ర' మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ హీరో సుదీప్‌ కిచ్చా.. 'ఈగ' మూవీతో తెలుగు అభిమానులకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత 'బహుబలి', 'సైరా' వంటి సినిమాలతో టాలీవుడ్‌లో మంచి ఇమేజ్‌ క్రియేట్‌ చేసుకున్నాడు. ఇటీవల రిలీజైన 'విక్రాంత్‌ రోణ' మూవీతో సుదీప్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఈ సినిమాతో కన్నడతో పాటు రిలీజైన ప్రతి లాంగ్వేజ్‌లో విజయం సాధించింది. కాగా గ‌త ఏడాది క‌న్న‌డ‌లో విడుద‌లై బ్లాక్ బాస్ట‌ర్‌గా నిలిచిన 'కోటీగ‌బ్బా-3' ఇప్పుడు తెలుగులో విడుద‌ల‌కు రెడీ అయ్యింది.

తెలుగులో ఈ మూవీని 'K3 కోటికొక్క‌డు' టైటిల్‌తో రిలీజ్‌ చేయనున్నారు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమా సెప్టెంబ‌ర్ 16న విడుద‌ల కానుందని మేకర్స్‌ వెల్లడించారు. ఈ సినిమా జూలైలోనే విడుద‌ల కావాల్సి ఉండగా.. మేకర్స్ 'విక్రాంత్ రోణ' మూవీ టాక్ త‌ర్వాత ఈ సినిమాను విడుద‌ల చేయాల‌ని భావించారు. ఇక 'విక్రాంత్ రోణ' తెలుగులో భారీ విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో 'K3' మేక‌ర్స్ ఇదే సరైన సమయం అని భావించి సినిమాను విడుద‌ల చేస్తున్నారు. శివ కార్తిక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో సుదీప్‌కు జోడీగా మ‌డోన్నా సెబాస్టియ‌స్ హీరోయిన్‌గా న‌టించింది.


Next Story