NTR31 ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌.. వైర‌ల్ అవుతున్న‌ పోస్ట‌ర్‌

Jr NTR's intense avatar in Prashanth Neel directorial leaves fans in awe.యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ నేడు 39 వ‌సంతంలోకి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 May 2022 1:29 PM IST
NTR31 ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌..  వైర‌ల్ అవుతున్న‌ పోస్ట‌ర్‌

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ నేడు 39 వ‌సంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌నకు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ.. ఆయ‌న న‌టిస్తున్న, న‌టించ‌నున్న చిత్రాల అప్‌డేట్‌ల‌ను వెల్ల‌డిస్తున్నారు. కొర‌టాల శివ‌తో చేయ‌నున్న NTR30 చిత్ర డైలాగ్ మోష‌న్ టీజ‌ర్ నిన్న‌ విడుద‌లై ప్రేక్ష‌కుల నుంచి విశేష స్పంద‌న తెచ్చుకోగా.. తాజాగా NTR31 సినిమాకు సంబంధించిన బిగ్ అప్‌డేట్‌ను మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ చిత్రానికి ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నట్లు పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ఈ చిత్ర ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ.. 'ర‌క్తంతో త‌డిచిన నేల మాత్ర‌మే ఎప్ప‌టికీ గుర్తుండిపోతుంది. అయితే..ఈ నేలే ఆయ‌న వార‌స‌త్వం.. ర‌క్తం కాదు' అంటూ రాసుకొచ్చారు. కాగా.. ఈపోస్ట‌ర్‌లో ఎన్టీఆర్ చాలా కోపంగా క‌నిపిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మించ‌నున్నాయి. వ‌చ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానున్న‌ట్లు చిత్ర‌బృందం తెలియ‌జేసింది. ప్ర‌స్తుతం ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఎన్టీఆర్ లుక్ అదిరిపోయింద‌ని నెటీజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

Next Story