దేవర నుంచి 'ఫియర్ సాంగ్' ప్రోమో అవుట్.. ఫుల్‌ ట్రాక్‌ ఎప్పుడంటే?

'దేవర' సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానుల కోసం జూనియర్‌ ఎన్టీఆర్‌ చిన్న సర్‌ప్రైజ్‌ ఇచ్చారు.

By అంజి  Published on  17 May 2024 8:15 PM IST
Jr NTR, Devara, Fear Song, Tollywood, Koratala Shiva

దేవర నుంచి 'ఫియర్ సాంగ్' ప్రోమో అవుట్.. ఫుల్‌ ట్రాక్‌ ఎప్పుడంటే?

'దేవర' సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానుల కోసం జూనియర్‌ ఎన్టీఆర్‌ చిన్న సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. మే 19న ఫియర్‌ సాంగ్‌ విడుదలకు ముందు సైలెంట్‌గా ప్రోమో వీడియోను పోస్ట్‌ చేశారు. 'ఫియర్ సాంగ్' అనిరుధ్ రవిచందర్ పాడారు. మే 19న తారక్ 41వ పుట్టినరోజు సందర్భంగా పవర్ ఫుల్ ట్రాక్ విడుదల కానుంది. 14 సెకన్ల నిడివిగల ఈ వీడియోలో ఎన్టీఆర్‌ స్టన్నింగ్‌ లుక్స్‌తో ఆకట్టుకుంటున్నారు. ఎన్టీఆర్, అనిరుధ్ రవిచందర్‌లను కలిగి ఉన్న ఈ ప్రోమో మూవీ లవర్స్‌ని ఆకట్టుకుంటోంది.

ఎన్టీఆర్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో టీజర్‌ను షేర్ చేస్తూ, "#FearSong from May 19th… #Devara" అని రాశారు. ఆసక్తికరంగా, అంతకుముందు పాట ప్రకటనతో పాటు, ఎన్టీఆర్ రక్తం చిమ్ముతున్న చేయితో కూడిన కొత్త పోస్టర్ షేర్ చేయబడింది. ఇది పాట విడుదల కోసం అభిమానుల ఉత్సాహాన్ని మరింత పెంచింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'దేవర' రెండు భాగాలుగా విడుదల కానుంది . మొదటి భాగం 'దేవర: పార్ట్ 1' అక్టోబర్ 10న థియేటర్లలో విడుదల కానుంది.

ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, సైఫ్ అలీఖాన్,జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్, కలైయరసన్ సహాయక తారాగణం. దేవరాజు అకా దేవరగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తుండగా, సైఫ్, జాన్వి వరుసగా భైరా, తంగంగా కనిపించనున్నారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అనిరుధ్ రవిచందర్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ సాంకేతిక బృందంలో భాగంగా ఉన్నారు.

Next Story