ఎన్టీఆర్ అభిమానుల‌కు శుభ‌వార్త‌.. కోలుకున్న తార‌క్‌

JR NTR tests Covid Negative. తాజాగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కు నిర్వ‌హించిన క‌రోనా పరీక్ష‌ల్లో నెగెటివ్‌గా వ‌చ్చింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 May 2021 11:02 AM IST
Jr NTR tests negative

దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ విజృంబిస్తోంది. సామాన్యులు, సెల‌బెట్రీలు అనే తేడాలేకుండా అంద‌రూ ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్నారు. ఇటీవ‌ల యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ కావ‌డంతో ఆయ‌న హోం ఐసోలేష‌న్‌లోకి వెళ్లారు. కాగా.. తాజాగా ఆయ‌న‌కు నిర్వ‌హించిన క‌రోనా పరీక్ష‌ల్లో నెగెటివ్‌గా వ‌చ్చింది. ఈ విష‌యాన్ని ఎన్టీఆర్ స్వ‌యంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నారు. ఈ విష‌యం తెలిసిన ఆయ‌న అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు.

'క‌రోనా ప‌రీక్ష‌లో నెగెటివ్ వ‌చ్చింద‌ని చెప్ప‌డానికి సంతోషంగా ఉంది. నేను త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆశించిన ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు. కిమ్స్ హాస్పిట‌ల్‌కు చెందిన‌ డాక్ట‌ర్ ప్ర‌వీణ్ కుల‌క‌ర్ణి, మా క‌జిన్ డాక్ట‌ర్ వీరు, టెనెట్ డ‌యాగ్నిస్టిక్స్‌ల‌కు ఈ సంద‌ర్భంగా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాను. వారి కేరింగ్ వ‌ల‌న నేను త్వ‌రగా కోలుకున్నాను. క‌రోనా చాలా ప్ర‌మాద‌క‌ర‌మైంది. కానీ.. ఇదొక వ్యాధే కాబ‌ట్టి త‌గిన జాగ్ర‌త్త‌లు, పాజిటివ్ ఆలోచ‌న‌తో జ‌యించ‌వ‌చ్చు. ఈ పోరాటంలో గెలిచేందుకు ధైర్య‌మే అతి పెద్ద ఆయుధం. ఆందోన ప‌డ‌కండి. మాస్క్ ధ‌రించండి. ఇంట్లోనే ఉండండి.' అని ట్వీట్ చేశాడు తార‌క్‌.


Next Story