ఎన్టీఆర్ థ్యాంక్స్ నోట్.. చరణ్ నువ్వు లేకపోతే ఆర్ఆర్ఆర్ లేదు
Jr NTR pens thank-you note on RRR success.దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) చిత్రం
By తోట వంశీ కుమార్ Published on 29 March 2022 1:38 PM ISTదర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం)' చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని వీక్షించేందుకు ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు పెడుతున్నారు. సినీ ప్రేక్షకుల నుంచి విమర్శల వరకు అందరూ ఈ చిత్రంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ లేఖను విడుదల చేశారు.
ఆర్ఆర్ఆర్ విడుదలైనప్పటి నుంచి మీరుఎన్నో ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రేమాభిమానాలు చాటుతున్నారు. నా కెరీర్ లోనే గొప్ప చిత్రంగా చెప్పుకునేలా చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు. నాలోని అత్యుత్తమ నటన ను బయటకు రాబట్టిన జక్కన్నకు ధన్యవాలు. నాలో ఉన్న గొప్ప నటుడిని బయటకు తీసుకొచ్చావు. నన్ను నిజంగా నీళ్లలా మార్చావు. కొత్తగా చూపించావు. నా పాత్రలో లీనమైపోయేలా..నన్ను నేను ఆ పాత్రకు తగినట్టు మలచుకునేలా నటుడిగా నన్ను మరింత ముందుకు తీసుకెళ్లావు.
ఇక.. చరణ్ నువ్వు లేకుండా ఆర్ఆర్ఆర్‌ను ఊహించలేను. నువ్వు లేకపోతే ఆర్ఆర్ఆర్ లేదు.అల్లూరి పాత్రకు నువ్వు సంపూర్ణ న్యాయం చేశావు. అల్లూరి పాత్రలేకపోతే భీమ్ పాత్ర అసంపూర్ణంగా ఉండేది. అజయ్ దేవ్‌గణ్ లాంటి గొప్ప నటితో పనిచేయడం నాకు దక్కిన గౌరవం. కీరవాణి గారు ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రాణం పోశారు. ఆలియా.. నటనకు నువ్వో పవర్ హౌస్. నీ పాత్రతో సినిమా మరింత శక్తిమంతమైంది. అంటూ చిత్రంలో పని చేసిన ప్రతి టెక్నిషియన్‌కు ఎన్టీఆర్ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.
ఆఖర్లో అభిమానాలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. మీ ప్రేమాభిమానులు, ఆప్యాయతల వల్లే కరోనా లాంటి కష్టకాలంలోనూ నేను బాగా చేయడానికి స్పూర్పిఇచ్చాయి. మరిన్ని సినిమాలతో మిమ్మల్ని ఇలాగే అలరిస్తానని మాటిస్తున్నా అని ఎన్టీఆర్ ఆ లేఖలో రాశారు.
I'm touched beyond words… pic.twitter.com/PIpmJCxTly
— Jr NTR (@tarak9999) March 29, 2022