ఆ సినిమా సక్సెస్ సెలెబ్రేషన్స్ కి వస్తున్న ఎన్టీఆర్

సిద్ధు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ సినిమా సంచలన విజయం సాధించింది. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 90 కోట్లకు పైగా వసూలు చేసింది

By Medi Samrat  Published on  6 April 2024 5:15 PM IST
ఆ సినిమా సక్సెస్ సెలెబ్రేషన్స్ కి వస్తున్న ఎన్టీఆర్

సిద్ధు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ సినిమా సంచలన విజయం సాధించింది. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 90 కోట్లకు పైగా వసూలు చేసింది. మొదటి భాగం కంటే బెటర్ గా ఉండడంతో టిల్లు స్క్వేర్ ను తెగ చూస్తున్నారు సినిమా లవర్స్. ఇప్పుడు టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్‌కు టాలీవుడ్ స్టార్ హీరో, జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఇది ఎన్టీఆర్ అభిమానులకు నిజంగా గొప్ప వార్త.

ఇటీవల టిల్లు స్క్వేర్ నిర్మాత నాగ వంశీ, జొన్నలగడ్డ సిద్ధూ, విశ్వక్ సేన్‌లతో కలిసి జూనియర్ ఎన్టీఆర్‌ ఫోటోలు తీసుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు ఈ సినిమా సక్సెస్ మీట్‌కి ఎన్టీఆర్ రాబోతూ ఉన్నాడు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 8న హైదరాబాద్‌లో జరగనుంది. సినిమా సక్సెస్ మీట్‌కి జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక అతిథిగా రావడం ఇటీవలి కాలంలో చాలా అరుదు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌లో ఎన్టీఆర్ 'అరవింద సమేత' సినిమా చేసాడు. అంతేకాకుండా డీజే టిల్లు సినిమాకు సంబంధించిన డైలాగ్ 'అట్లుంటది మనతోని' అంటూ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ చెప్పిన సంగతి కూడా తెలిసిందే. ఆ సినిమా మీద ఉన్న ప్రేమతో ఎన్టీఆర్ సక్సెస్ మీట్ కు వస్తూ ఉన్నారని కూడా అంటున్నారు. మరోవైపు టిల్లు స్క్వేర్ ఫుల్ రన్‌లో 100 కోట్లకు పైగా వసూలు చేసే అన్ని అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా సంచలనాత్మక ఓపెనింగ్ డే కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. అలాగే మంచి వారాంతపు కలెక్షన్లను సాధించి ట్రేడ్ విశ్లేషకులందరినీ ఆశ్చర్యపరిచింది. జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ మీట్ కు వస్తూ ఉండడంతో ఈ సినిమా జనంలోకి మరింత రీచ్ పెరిగే అవకాశం ఉంది.

Next Story