'ఆర్‌ఆర్‌ఆర్‌' ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

JR NTR and Ram Charan led RRR Movie OTT release date fix.సినీ అభిమానుల ఎదురుచూపుల‌కు తెర‌ప‌డ‌నుంది. అంద‌రూ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 May 2022 12:21 PM IST
ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

సినీ అభిమానుల ఎదురుచూపుల‌కు తెర‌ప‌డ‌నుంది. అంద‌రూ ఎంత‌గానో ఎదురుచూస్తున్న 'ఆర్ఆర్ఆర్(రౌద్రం ర‌ణం రుధిరం)' చిత్రం డిజిట‌ల్ ప్రీమియ‌ర్‌కు రంగం సిద్ద‌మైంది. మ‌రో వారం రోజుల్లో ఈ చిత్రం ప్రేక్ష‌కులకు అందుబాటులో రానుంది.

ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన బిగ్గెస్ట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ 'ఆర్ఆర్ఆర్' మార్చిలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించింది. రూ.1000 కోట్లకు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఇక ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వ‌స్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఓటీటీ తేదీ ఖరారైంది. జీ 5లో ఈ నెల (మే)20 తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ద‌క్షిణాది బాష‌లైన తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళీ భాష‌ల్లో అందుబాటులోకి రానున్న‌ట్లు తెలిపింది.

ఇక అదే రోజున యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు కావ‌డంతో.. అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి.

Next Story