ఆర్ఆర్ఆర్ థియేటర్స్ వ‌ద్ద పండగ వాతావరణం.. బెనిఫిట్ షోని చూసిన ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌

Jr NTR And His Family Watching RRR Movie at AMB Cinemas.తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ మేనియానే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 March 2022 4:34 AM GMT
ఆర్ఆర్ఆర్ థియేటర్స్  వ‌ద్ద పండగ వాతావరణం.. బెనిఫిట్ షోని చూసిన ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ మేనియానే క‌నిపిస్తోంది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో ద‌ర్శ‌క‌దీరుడు జ‌క్క‌న్న తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని చూసేందుకు సామాన్యుల నుంచి సెల‌బ్రెటీలు క్యూ క‌డుతున్నారు. ఇప్ప‌టికే చాలా ప్రాంతాల్లో బెనిఫిట్ షోలు ప్ర‌ద‌ర్శించారు. థియేట‌ర్ల వ‌ద్ద అభిమానుల హంగామా మామూలుగా లేదు. భారీ కటౌట్లు, పూజలతో పాటు నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ప‌లు చోట్ల బాణా సంచా కాలుస్తూ సంద‌డి చేస్తున్నారు. మొత్తంగా థియేట‌ర్ల వ‌ద్ద పండుగ వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది.

ప్రేక్షకుల కోలాహలం మధ్య ఈ చిత్రంలో లీడ్‌రోల్‌ పోషించిన ఎన్టీఆర్‌, రామ్‌చరణ్ లు సినిమా చూశారు. నగరంలోని ఏఎంబీ మాల్‌లో జూనియర్‌ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కుటుంబ సభ్యులు‌, కూక‌ట్‌ప‌ల్లిలోని భ్రమరాంబ థియేటర్‌లో రామ్‌చరణ్‌ దంపతులు సందడి చేశారు. సినిమా పూర్తి అయిన అనంత‌రం తార‌క్ చిరున‌వ్వుతో బ‌య‌ట‌కు వ‌చ్చి డ‌బుల్‌థంబ్స్ ఆఫ్ చూపించారు. చూస్తుంటే ఎన్టీఆర్ పుల్ హ్యాపీగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇక చెర్రీ థియేట‌ర్ నుంచి బ‌య‌ట‌కు రాగానే అభిమానులంద‌రూ ఫోటోలు తీసుకునేందుకు పోటీ ప‌డ్డారు. చ‌ర‌ణ్ కూడా అంద‌రిని పలకరించి, ఫోటోలకు ఫోజులిచ్చారు.

డివివి దానయ్య ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో నిర్మించారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. అలియా భట్, అజయ్ దేవగన్, ఒలీవియా మోరిస్, సముద్రఖని, రే స్టీవెన్‌సన్, అలిసన్ డూడీ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

Next Story