దర్శకుడు జోషి దర్శకత్వంలో రాబోతున్న 'ఆంటోనీ' సినిమా.. కీలక పాత్రలో జోజు జార్జ్

Joju George’s next with filmmaker Joshiy titled ‘Antony’. డైరెక్టర్ జోషి ప్రస్తుతం మరో అద్భుతమైన సినిమాతో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమ‌య్యారు.

By Medi Samrat  Published on  14 April 2023 9:37 PM IST
దర్శకుడు జోషి దర్శకత్వంలో రాబోతున్న ఆంటోనీ సినిమా.. కీలక పాత్రలో జోజు జార్జ్

డైరెక్టర్ జోషి ప్రస్తుతం మరో అద్భుతమైన సినిమాతో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమ‌య్యారు. అంత‌కుముందు సురేష్ గోపీతో పప్పన్ తో సూప‌ర్ హిట్ కొట్టిన‌ జోషి.. ప్ర‌స్తుతం ఆంటోనీ అనే సినిమాతో మరో కొత్త కథను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. జోజు జార్జ్, ఉష, చెంబన్ వినోద్ జోస్, విజయ రాఘవన్ నటీనటులు. జోషి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన‌ గ‌త చిత్రాలు పోరింజు, జ్యూస్ ల‌లో వీరు కీల‌క‌పాత్ర‌లు పోషించారు. మ‌రోసారి వీరు ఆంటోనీ సినిమాలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్, ఆశ శరత్ కూడా కీలక పాత్రల‌లో న‌టించారు.

డైరెక్టర్ జోషి, జోజు జార్జ్ ల కాంబినేష‌న్‌లో పోరింజు, జ్యూస్ సినిమాలు ఈ మధ్యకాలమే విడుదలయ్యి మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఈ సినిమాలో జోజు పోషించిన పోరింజు పాత్రకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్ర‌స్తుతం ఈ కాంబినేషన్ లో మరో సినిమా వస్తోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ మధ్యకాలంలో విడుదలైన ఇరట్ట సినిమా తరువాత జోజు మరోసారి హీరో పాత్రలో ఆంటోనీ సినిమాలో కనిపించబోతున్నారు. ఆంటోని సినిమాను ఐన్‌స్టీన్ మీడియా బ్యానర్‌పై ఐన్‌స్టీన్ జాక్ పాల్ నిర్మిస్తున్నారు. కొచ్చి లోని క్రౌన్ ప్లాజా హోటల్‌లో ఈ సినిమా టైటిల్ లాంచ్, పూజా కార్యక్రమాలు జరిగాయి.

ఈ చిత్రానికి రచన: రాజేష్ వర్మ, సినిమాటోగ్రఫీ: రణదివే ఎడిటింగ్: శ్యామ్ శశిధరన్, సంగీతం: జేక్స్ బిజోయ్, ప్రొడక్షన్ కంట్రోలర్: దీపక్ పరమేశ్వరం, ఆర్ట్ డైరెక్షన్: దిలీప్ నాథ్, కాస్ట్యూమ్ డిజైనర్‌: ప్రవీణ్ వర్మ, మేకప్: రోనెక్స్ జేవియర్ సాంకేతిక సిబ్బంది కాగా.. అప్పు పాతు పప్పు ప్రొడక్షన్ హౌస్‌ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది.


Next Story