ఇండస్ట్రీలో ఒక్కోసారి తమని తాము తక్కువ చేసుకోవాల్సి వస్తుందని హీరోయిన్ జాన్వీకపూర్ అన్నారు. టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్ టాక్ షోలో ఇండస్ట్రీలో పురుష అహంకారంపై ఓపెన్ కామెంట్స్ చేశారు.
'ఇక్కడ కొనసాగాలంటే మేల్ ఈగోని ఎదుర్కోవాలి. నలుగురు మహిళలు ఉంటే నా అభిప్రాయం నిర్భయంగా చెప్తా. అదే ప్లేస్‌లో పురుషులు ఉంటే నా ఒపీనియన్ చెప్పలేను. గొప్పగా నటించే సామర్థ్యం ఉన్నప్పటికీ.. అవతలి వారి కోసం కొంచెం తగ్గి నటించాల్సి వస్తుంది. మనకు నచ్చని విషయాలను నేను చేయను అని చెప్పలేక.. అర్థం కాలేదు అని చెప్పాల్సి వస్తుంది' అని తెలిపారు.
పురుషాధిక్య ప్రపంచంలో నెగ్గాలంటే కొన్నిసార్లు సైలెంట్‌గా ఉండాల్సి వస్తుందని, అలా తాను ఎన్నోసార్లు ఉన్నానని చెప్పారు. తాను సినీ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుండే వచ్చినప్పటికీ.. తాను కొన్ని విషయాలను ఇక్కడికి వచ్చాకే నేర్చుకున్నానని చెప్పారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. జాన్వీ కపూర్ ఇటీవలే 'సన్నీ సంస్కారి కీ తులసి కుమారి' తన ప్రేక్షకులను పలకరించారు. రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కుతున్న 'పెద్ది'లో జాన్వీ నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానుంది.