ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది.. ఎన్టీఆర్ స‌ర‌స‌న అతిలోక సుంద‌రి త‌న‌య‌

Janhvi Kapoor officially comes on board Jr NTR starrer. అతిలోక సుంద‌రి శ్రీదేవి కూతురు జాన్వీ క‌పూర్ ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టిస్తుంది

By Medi Samrat  Published on  6 March 2023 7:19 PM IST
ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది.. ఎన్టీఆర్ స‌ర‌స‌న అతిలోక సుంద‌రి త‌న‌య‌

Janhvi Kapoor


ఎట్టకేలకు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రకటన వచ్చింది. అతిలోక సుంద‌రి శ్రీదేవి కూతురు జాన్వీ క‌పూర్ ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టిస్తుంది. మార్చి 6న పుట్టినరోజు సందర్భంగా జాన్వీ కపూర్ అభిమానులకు ఇది డబుల్ సెలబ్రేషన్. ఎన్టీఆర్ 30 మేకర్స్ ఈ చిత్రం నుండి జాన్వీ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. జాన్వీ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతుంది. సోమవారం.. మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ఈ చిత్రంలో క‌థానాయిక‌ పాత్ర‌కు జాన్వీని ఎంచుకున్నట్లు ప్రకటించారు. ట్విట్టర్‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్ సోమవారం జాన్వీ కపూర్ పోస్టర్‌ను షేర్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. స్వాగతం ప‌లికింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. జాన్వీ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టర్‌ను షేర్ చేసింది. జాన్వీ కి జూనియర్ ఎన్టీఆర్ స్వాగతం చెబుతూ.. జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్ 30 సినిమా 10 నెలలకు పైగా వాయిదా పడుతూ వస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు అప్‌డేట్ రావ‌డంతో ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు అభిమానులు. ఆస్కార్‌ వేడుకల సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ సోమవారం అమెరికా వెళ్లాడు. ‘RRR’ టీం నుండి రామ్ చరణ్, రాజమౌళి ఇప్పటికే యుఎస్‌లో ఉన్నారు.



Next Story