కోట్ల రూపాయల ఖరీదైన ఇల్లు కొన్న నటి!

Janhvi Kapoor Buys A Swanky ₹ 39 Crore Apartment In Juhu. ముంబైలోని జుహు ప్రాంతం లో కోట్ల రూపాయల ఖరీదైన ఇల్లు కొన్న జాన్హవి కపూర్. .

By Medi Samrat  Published on  5 Jan 2021 4:49 PM IST
Janhvi Kapoor

ముంబైలోని జుహు ప్రాంతం కేరాఫ్ సెలబ్రిటీల అడ్రస్ గా మారిపోయి ఉంటుంది. బాలీవుడ్ స్టార్ హీరోలందరూ ఎక్కువగా ఈ ప్రాంతంలోనే స్థలాలను విక్రయిస్తుంటారు. ఈ ప్రాంతంలో ఆస్తులు కొనుక్కోవాలన్నా భారీ స్థాయిలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్ అయినా అలియా భట్, రణబీర్ కపూర్ , హృతిక్ రోషన్ వంటి ప్రముఖ సెలబ్రిటీలు ఈ ప్రాంతంలో ఆస్తులను కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో అతిలోక సుందరి అయినా శ్రీదేవి ముద్దుల తనయ జాన్వి కపూర్ కూడా ఇంటిని కొనుగోలు చేశారు.

స్క్వేర్ ఫీట్ ఇండియా నివేదిక ప్రకారం జాన్వీ కపూర్ కొనుగోలు చేసిన కొత్త ఇల్లు జుహు భవనంలో మూడు అంతస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. జాన్వికపూర్ ఈ ఇంటిని ఏకంగా 39 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు.శ్రీదేవి మరణాంతరం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన జాన్వికపూర్ కేవలం రెండు సినిమాలలో మాత్రమే నటించి ఇంత పెద్ద మొత్తంలో ఇళ్లను కొనుగోలు చేయడంపై ప్రస్తుతం బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.

జాన్వి కపూర్ కొత్తగా కొనుగోలు చేసిన ఇంటిని డిసెంబర్ 7వ తేదీన ఒప్పందం జరిగిందని స్క్వేర్ ఫీట్ ఇండియా నివేదిక తెలిపింది. ఇక ఈ ఇల్లు 3,456 చదరపు అడుగుల విస్తీర్ణం ఉంది.ధడక్‌ చిత్రం ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వి కపూర్ తర్వాత గుంజన్‌ సక్సెనా చిత్రంలో నటించారు. ఈ రెండు చిత్రాలలో మాత్రమే కాకుండా జోయా అక్తర్‌ ఘోస్ట్‌ అనే వెబ్ సిరీస్ లో కూడా సందడి చేశారు. ప్రస్తుతం జాన్వికపూర్ దోస్తానా 2, రూహి అఫ్జానా చిత్రాల్లో నటించనున్నారు. ప్రస్తుతం జాన్వీ కపూర్ కొత్త ఇంటికి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Next Story