శ్రీరామనవమి స్పెషల్‌.. 'జై హనుమాన్‌' నుంచి అప్‌డేట్‌

ఈ ఏడాది జనవరిలో రిలీజ్‌ అయిన 'హనుమాన్‌' సినిమాకు కొనసాగింపుగా.. 'జై హనుమాన్‌' సినిమాను టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ తీస్తున్నారు.

By అంజి  Published on  17 April 2024 8:05 AM GMT
Jai Hanuman Movie, Prashanth Varma, Tollywood

శ్రీరామనవమి స్పెషల్‌.. 'జై హనుమాన్‌' నుంచి అప్‌డేట్‌

ఈ ఏడాది జనవరిలో రిలీజ్‌ అయిన 'హనుమాన్‌' సినిమాకు కొనసాగింపుగా.. 'జై హనుమాన్‌' సినిమాను టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ తీస్తున్నారు. ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా అందుకు సంబంధించిన అప్‌డేట్‌ను రిలీజ్‌ చేశారు. ‘హనుమాన్‌’ సీక్వెల్ ‘జై హనుమాన్‌’ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను పంచుకున్నాడు. 'శ్రీరాముడి దీవెనలతో.. మీకు ఇంతకు ముందు ఎన్నడూ లేని అనుభవాన్ని ఈ సినిమాతో అందించబోతున్నా. మనందరికీ ఇది చాలా ప్రత్యేకమైన సినిమా' అని ప్రశాంత్ వర్మ పోస్టు చేశారు.

శ్రీరాముడి చేతిలో హనుమంతుడి చేయి ఉన్నట్టుగా డిజైన్‌ చేసిన పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా 'రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏమిటి?' అన్న స్టోరీతో రానుంది. లేటెస్ట్‌ పోస్ట‌ర్ చూసిన మూవీ లవర్స్‌ థ్రిల్‌గా ఫీలవుతున్నారు. ఈ సినిమాను 2025 విడుద‌ల చేయ‌డానికి మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగా రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ 'హనుమాన్‌'.. సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ.250 కోట్లుకు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టింది. తేజ సజ్జా కథానాయకుడిగా న‌టించారు.

Next Story