కరోనా కారణంగా జగపతి బాబు మేకప్ మ్యాన్ లా మారిపోయాడా..?

Jagapathi Babu Turns Into Makeup Man.తాజాగా నటుడు జగపతి బాబు కూడా మేకప్ మ్యాన్ లా మారిపోయాడు. కరోనా వ‌ల్ల మేక‌ప్ మెన్ అందుబాటులో లేక‌పోవ‌డంతో

By Medi Samrat  Published on  19 April 2021 1:12 PM IST
Jagapathi Babu

కరోనా మహమ్మారి ఎంతో మంది జీవితాలపై ప్రభావం చూపుతూ ఉంది. చాలా మందికి ఉపాధి కూడా లేకుండా పోతోంది. ముఖ్యంగా సినిమా షూటింగ్ లపై కూడా కరోనా ప్రభావం చూపిస్తోంది. చాలా వరకూ తక్కువ మందితోనే సినిమా షూటింగ్ లను కూడా నిర్వహించేస్తూ ఉన్నారు. దీంతో చాలా విభాగాల్లో ఉన్న వారిని షూటింగ్ కు రాకండని చెబుతూ ఉన్నారు. అలా ఉపాధి కోల్పోయిన వారు ఎంతో మంది ఉన్నారు. ఇంకొన్ని చోట్ల కరోనా టెస్టు చేయించుకుని.. కరోనా నెగటివ్ సెర్టిఫికెట్ ఉంటేనే షూటింగ్ లను అనుమతి ఇస్తూ ఉన్నారు. దీంతో చాలా మంది కరోనా టెస్టులకు డబ్బులు లేక.. ఇళ్లల్లోనే ఉండిపోతూ ఉన్నారు. ఇక షూటింగ్ సమయాల్లో చాలా మందిని తప్పిస్తూ ఉన్నారు. దీంతో సినిమా స్టార్స్ తమ పనులు తామే చేసుకుంటూ ఉన్నారు. షూటింగ్ సమయాల్లో మేకప్ మేన్ చాలా ముఖ్యమన్న సంగతి తెలిసిందే..! కానీ కరోనా కారణంగా కొందరు మేకప్ మెన్లను పక్కన పెడుతూ ఉన్నారు. దీంతో సదరు నటీనటులే సొంతంగా మేకప్ వేసుకుంటూ ఉన్నారు.

తాజాగా నటుడు జగపతి బాబు కూడా మేకప్ మ్యాన్ లా మారిపోయాడు. కరోనా వ‌ల్ల మేక‌ప్ మెన్ అందుబాటులో లేక‌పోవ‌డంతో సినీ ప్ర‌ముఖులు సొంతంగా మేక‌ప్ వేసుకుంటున్నారు.షూటింగ్ లో పాల్గొన్న జగపతి బాబు త‌న మేక‌ప్ తానే వేసుకుంటూ ఫొటో తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆయ‌న ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు. క‌రోనాకు కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నాన‌ని దాని వల్లే తన‌కు తాను మేకప్ ‌మన్‌ అయ్యాన‌ని అన్నారు. జగపతి బాబు మహాసముద్రం సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఇప్పటికే పలు చిత్రాల షూటింగులు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. దీంతో మహా సముద్రం చిత్ర బృందం కరోనా విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ కనబరుస్తూ ఉంది. మహా సముద్రంలో శర్వానంద్ హీరోగా నటిస్తూ ఉండగా.. సిద్ధార్థ చాలా ఏళ్ల తరువాత తెలుగు సినిమాలో నటిస్తూ ఉన్నారు. అను ఎమ్మాన్యుయేల్, అదితి రావ్ హైదరి హీరోయిన్లుగా సందడి చేయనున్నారు. ఆర్ ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉన్నాడు.


Next Story