పాటియాలా కోర్టుకు హాజరైన జాక్వెలిన్

Jacqueline reaches Patiala House Court. మనీలాండరింగ్‌ కేసులో బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ ఢిల్లీలోని పాటియాలా కోర్టుకు హాజరయ్యారు.

By M.S.R  Published on  10 Nov 2022 2:30 PM IST
పాటియాలా కోర్టుకు హాజరైన జాక్వెలిన్

మనీలాండరింగ్‌ కేసులో బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ ఢిల్లీలోని పాటియాలా కోర్టుకు హాజరయ్యారు. కాన్ మ్యాన్ సుఖేష్‌ చంద్రశేఖర్‌కు సంబంధించిన 200 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ కోర్టు మధ్యంత బెయిల్‌ మంజూరు చేసింది. నవంబర్‌ 10వ తేదీ వరకు కోర్టు మధ్యంత బెయిల్‌ మంజూరు చేయగా.. ఈ బెయిల్‌ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆమె గురువారం ఢిల్లీలోని పాటియాలా కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో రెగ్యులర్‌ బెయిల్‌, ఇతర పెండింగ్‌ దరఖాస్తులపై నేడు కోర్టు విచారణ చేపట్టనుంది.

మరోవైపు సుఖేష్‌ చంద్రశేఖర్‌ పలు సంచలన ఆరోపణలు చేస్తూ వెళుతున్నాడు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)పైనా, ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ పైనా తాను చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకోకపోతే తనను, తన భార్యను కొట్టి చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని ఢిల్లీ జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు లేఖ రాశాడు. జైలులో ఉన్న సీఆర్‌పీఎఫ్ సిబ్బంది నిరంతరం బెదిరింపులు, దుర్భాషలాడుతున్నారని.. తనతో పాటు తన భార్యను ఢిల్లీ వెలుపల మరొక జైలుకు తరలించాలని విజ్ఞప్తి చేశాడు. ఆప్‌పై చేసిన అన్ని అభియోగాలను ఉపసంహరించుకోవాలని జైలు అధికారులు తన భార్యను బెదిరించారని ఆరోపించాడు.


Next Story