జబర్దస్త్ కమెడియన్‌ చలాకీ చంటికి గుండెపోటు

కమెడియన్ చలాకీ చంటి అస్వస్థతకు గురయ్యారు. ఈ నెల 21న అతడికి తీవ్రమైన ఛాతినోప్పి వచ్చింది. దీంతో వెంటనే కుటుంబ

By అంజి
Published on : 24 April 2023 7:49 AM IST

Jabardast comedian, Chalaki Chanti , Tollywood

జబర్దస్త్ కమెడియన్‌ చలాకీ చంటికి గుండెపోటు

కమెడియన్ చలాకీ చంటి అస్వస్థతకు గురయ్యారు. ఈ నెల 21న అతడికి తీవ్రమైన ఛాతినోప్పి వచ్చింది. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని కేర్‌ ఆస్పత్రికి తరలించారు. చంటికి ఆరోగ్య పరీక్షలు చేసిన వైద్యులు.. గుండోపోటుగా గుర్తించారు. వైద్య పరీక్షల్లో శరరీంలోని రక్త నాళాల్లో పూడికలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం చంటికి స్టంట్లు వేశారని, అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం చంటి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ప్రముఖ టీవీ ఛానెల్‌లో వచ్చే కామెడీ పోగ్రాం జబర్దస్త్‌ ద్వారా కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నాడు చంటి. జ‌బ‌ర్ధ‌స్త్ షో పాపుల‌ర్ క‌మెడియ‌న్స్‌లో చంటి ఒకడు. చంటి పలు సినిమాల్లో నటిస్తూ యాంకర్‌గా కూడా చేశాడు. న‌ల్ల‌మ‌ల‌, ఆట‌గ‌ద‌రా శివ‌తో పాటు ప‌లు తెలుగు సినిమాల్లో డిఫ‌రెంట్ రోల్స్ చేశాడు చంటి. ఇటీవ‌లే ముగిసిన బిగ్‌బాస్ సీజ‌న్ సిక్స్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు. ఎప్పుడూ అందరినీ నవ్వించే చంటి ఇలా చిన్న వయసులో ఇలా ఆసుపత్రిలో చేరడం జబర్దస్త్‌ ఫ్యాన్స్ కి, కుటుంబ సభ్యులకు బాధ కలిగించే విషయంగా మారింది.

Next Story