బంగారం బ్యూటీ.. తన అక్క ప్రియాంక చోప్రా గురించి ఏమంటోందో తెలుసా..?

Meera Chopra about Priyanka Chopra. మీరా చోప్రా మాత్రం ప్రియాంక చోప్రా వల్ల పెద్దగా అవకాశాలు రాలేదని అంటోంది.

By Medi Samrat  Published on  28 April 2021 5:54 PM IST
Meera Chopra

మీరా చోప్రా.. పవన్ కళ్యాణ్ బంగారం సినిమా ద్వారా టాలీవుడ్ లో కనిపించింది. ఆ తర్వాత ఆమెకు పెద్దగా తెలుగులో అవకాశాలు రాలేదు. యాక్టింగ్ అంత గొప్పగా చేయలేదనే విమర్శలు కూడా గతంలో వచ్చాయి. ఇక ప్రియాంక చోప్రాకు కజిన్ సిస్టర్ కావడంతో కాస్త గుర్తింపు వచ్చి బాలీవుడ్ లో అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు ఆమె మాత్రం ప్రియాంక చోప్రా వల్ల పెద్దగా అవకాశాలు రాలేదని అంటోంది. బాలీవుడ్ లో అడుగుపెట్టినప్పుడు ప్రియాంక సోదరి వచ్చిందంటూ ఎంతో ప్రచారం జరిగిందని మీరా చోప్రా తెలిపారు.

అయితే తాను ఆమెతో ఎలాంటి కంపారిజన్స్ పెట్టుకోలేదని చెప్పారు. ప్రియాంక వల్ల తనకు అదనంగా ఎలాంటి అవకాశాలు రాలేదని చెప్పారు. ప్రియాంక బంధువుని అయినంత మాత్రాన తనకు కెరీర్ పరంగా లాభించింది ఏమీ లేదని.. ఇది కూడా తనకు మేలే చేసిందని తెలిపారు. అందరూ తనను ఆమె సోదరిగా కాకుండా, ప్రత్యేకంగా చూశారని చెప్పారు. ప్రియాంక వల్ల సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చినట్టు తనకు గుర్తింపు వచ్చిందని, ఆమె వల్ల తనకు కలిగిన లబ్ధి అంతేనని మీరా తెలిపారు. ఈ గుర్తింపు కూడా లేకపోతే తాను చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేదని మాత్రం ఒప్పుకుంది. ఇంతకూ ఆమె ప్రియాంక చోప్రా బంధువైనందుకు లాభపడిందో.. నష్టపోయిందో మాత్రం సరైన క్లారిటీ ఇవ్వలేదు.


Next Story