అఫీషియ‌ల్‌.. ప్ర‌భాస్ 'ఆదిపురుష్' వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ చెప్పిన ద‌ర్శ‌కుడు

It's Official Prabhas' Adipurush Postponed.ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తోన్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ఆదిపురుష్.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Nov 2022 8:39 AM IST
అఫీషియ‌ల్‌.. ప్ర‌భాస్ ఆదిపురుష్ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ చెప్పిన ద‌ర్శ‌కుడు

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ అభిమానుల‌కు బ్యాడ్‌న్యూస్‌. ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తోన్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ఆదిపురుష్. ఈ సినిమా విడుద‌ల‌ మ‌రోసారి వాయిదా ప‌డింది. ఈ చిత్ర విష‌యాన్ని చిత్ర ద‌ర్శ‌కుడు ఓం రౌత్ సోమ‌వారం ఉద‌యం సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేశాడు. ఆదిపురుష్ అనేది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు. మన సంసృతి, శ్రీరాముడికి చెందిన ఒక భక్తి, చరిత్ర. ప్రేక్ష‌కుల‌కు అద్భుత‌మైన విజువ‌ల్ అనుభూతిని అందించ‌డం కోసం మ‌రికొంత స‌మ‌యం తీసుకోవాల్సి వ‌స్తోంది. అందుకే సినిమాని వాయిదా వేస్తున్నాము. ఆదిపురుష్ సినిమా జూన్ 16, 2023లో రిలీజ్ అవుతుంది. భార‌త‌దేశం గ‌ర్వించే సినిమా మీ ముందుకు తీసుకురావాల‌ని మేము నిర్ణ‌యించుకున్నాం. మీ ప్రేమాభిమానాలే మమ్మ‌ల్ని ముందుకు న‌డిపిస్తున్నాయి. అని ట్వీట్ చేశారు. ఈ వార్త‌తో ప్ర‌భాస్ అభిమానులు నిరాశ చెందుతున్నారు.

రామాయ‌ణాన్ని ఆధారంగా చేసుకుని 'ఆదిపురుష్' చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. దాదాపు రూ.400 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన‌ట్లు తెలుస్తోంది. రాముడి పాత్ర‌లో ప్ర‌భాస్‌, సీత‌గా కృతిస‌న‌న్‌, రావ‌ణాసురుడిగా సైఫ్ అలీఖాన్ న‌టించారు. ద‌స‌రా కానుక‌గా ఈ చిత్ర టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌గా.. చాలా మంది విమ‌ర్శ‌లు చేశారు. రామాయణం అనుకొని గొప్పగా అనుకుంటే ఇదేదో బొమ్మల సినిమా తీస్తున్నారు, మొత్తం గ్రాఫిక్స్ తోనే ఉంది అని విమర్శలు వచ్చాయి. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి వీఎఫ్ఎక్స్ ప‌నుల‌పై చిత్ర బృందం దృష్టి సారించిన‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే సంక్రాంతి బ‌రి నుంచి ఆదిపురుష్ చిత్రం త‌ప్పుకుంది.

Next Story