వాళ్ళతో రొమాన్స్ అంటే.. నాన్నను హత్తుకున్నట్లుగా అనిపించేది

2000వ దశకంలో హిందీ చిత్ర పరిశ్రమలో మంచి మంచి అవకాశాలను దక్కించుకున్న నటి ఇషా కొప్పికర్. తెలుగులో కూడా పలు సినిమాలలో నటించింది.

By Medi Samrat  Published on  22 Jun 2024 8:07 PM IST
వాళ్ళతో రొమాన్స్ అంటే.. నాన్నను హత్తుకున్నట్లుగా అనిపించేది

2000వ దశకంలో హిందీ చిత్ర పరిశ్రమలో మంచి మంచి అవకాశాలను దక్కించుకున్న నటి ఇషా కొప్పికర్. తెలుగులో కూడా పలు సినిమాలలో నటించింది. చంద్రలేఖ, ప్రేమతో రా సినిమాల్లో నటించిన ఇషా కొప్పికర్ నిఖిల్ హీరోగా కేశవ సినిమాలో కీలక పాత్ర పోషించింది. ఇటీవల ఆమె వయసులో చాలా పెద్దగా ఉండే హీరోలతో రొమాన్స్ చేయడం గురించి మాట్లాడింది. అలాంటి హీరోలతో చేయడం అసౌకర్యంగా అనిపించేదని తెలిపింది.

సిద్ధార్థ్ కన్నన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, సునీల్ శెట్టి, గోవింద వంటి సీనియర్ నటులతో కలిసి పనిచేసినప్పుడు తన అనుభవాల గురించి చెప్పింది. మీ కంటే 30 లేదా 20 ఏళ్లు పెద్దవారితో పని చేస్తున్నప్పుడు ఎంతో అసౌకర్యంగా అనిపిస్తుంది. క్యారెక్టర్ లో భాగంగా మీ భాగస్వామిని లేదా ప్రేమికుడిని కౌగిలించుకున్నట్లు మీకు మీ తండ్రిని కౌగిలించుకున్నట్లు అనిపిస్తుంది. నాకు కూడా మొదట్లో అలా అనిపించేదని ఇషా తెలిపింది. మీరు నటిస్తూ ఉన్నప్పుడు ఇలాంటి విషయాలను పట్టించుకోకూడదు.. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి. కొందరు మనతో చాలా బాగా ఉంటారు.. మరికొందరు మేము సీనియర్లు మా స్థాయి ఇదే అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారని తనకు ఎదురైన అనుభవాలను ఇషా కొప్పీకర్ వెల్లడించింది.

Next Story