సూపర్ ఛాన్స్ కొట్టేసిన శామ్..!

తమిళ స్టార్ హీరో విజయ్ త్వరలోనే పాలిటిక్స్ లోకి రాబోతున్నారు. అంతలోపు కేవలం రెండు సినిమాలు మాత్రమే చేస్తానని చెప్పేశాడు

By Medi Samrat  Published on  1 July 2024 9:15 PM IST
సూపర్ ఛాన్స్ కొట్టేసిన శామ్..!

తమిళ స్టార్ హీరో విజయ్ త్వరలోనే పాలిటిక్స్ లోకి రాబోతున్నారు. అంతలోపు కేవలం రెండు సినిమాలు మాత్రమే చేస్తానని చెప్పేశాడు. హెచ్ వినోద్ ప్రాజెక్ట్ తన చివరి ప్రాజెక్ట్ గా చెప్పాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ షూటింగ్‌ను ఇటీవలే విజయ్ ముగించాడు. హెచ్.వినోత్ దర్శకత్వంలో తలపతి 69 వ సినిమా చేయబోతున్నాడు. సమంతను ప్రాజెక్ట్‌లోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సమంత ప్రస్తుతం యశోద, శాకుంతలం, ఖుషి రూపంలో వరుస బాక్సాఫీస్ వైఫల్యాలను ఎదుర్కొంది. ఈ సినిమాలో ఛాన్స్ దక్కడం అంటే సమంతకు భారీ అవకాశం దక్కినట్లే. అందుకే దళపతి 69లో విజయ్ సరసన సమంత జతకట్టనుంది. హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తునానఁ ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ అందిస్తూ ఉండగా, కెవిఎన్ ప్రొడక్షన్స్ ఈ ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. ఈ చిత్రం సంవత్సరం చివరి నాటికి దాని షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ సినిమా విడుదల తర్వాత, విజయ్ తమిళనాడు రాజకీయాల్లోకి రానున్నారు.

Next Story