సల్మాన్ ఖాన్-రజనీకాంత్ ఒకే సినిమాలో.. నిజమయ్యేనా.?

దర్శకుడు అట్లీ షారుఖ్ ఖాన్ నటించిన జవాన్‌తో భారీ బ్లాక్‌బస్టర్‌ని అందుకున్నాడు.

By Medi Samrat  Published on  29 Jan 2025 8:46 PM IST
సల్మాన్ ఖాన్-రజనీకాంత్ ఒకే సినిమాలో.. నిజమయ్యేనా.?

దర్శకుడు అట్లీ షారుఖ్ ఖాన్ నటించిన జవాన్‌తో భారీ బ్లాక్‌బస్టర్‌ని అందుకున్నాడు. పాన్-ఇండియా దర్శకుడిగా ఎదిగాడు. ఆ తర్వాత అట్లీ.. అల్లు అర్జున్‌తో ఓ ప్రాజెక్ట్ చేయాల్సి ఉండగా కొన్ని సమస్యల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. త్వరలో సల్మాన్ ఖాన్ – రజనీకాంత్ మల్టీస్టారర్ కోసం అట్లీ సిద్ధమవుతున్నాడనేది వార్త అటు బాలీవుడ్ ఫ్యాన్స్ ను, ఇటు కోలీవుడ్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తోంది.

అట్లీ కుమార్ ఇప్పటికే సల్మాన్‌ ఖాన్ ను సంప్రదించాడు. సల్మాన్ సినిమా చేయడానికి అంగీకరించాడు కూడా.. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటారు. అట్లీ కోలీవుడ్ నుండి మరొక స్టార్ హీరోని సినిమాలో భాగం చేయాలని భావించాడు. ఆ పాత్రను పోషించడానికి కమల్ హాసన్, రజనీకాంత్‌తో చర్చలు జరుపుతున్నాడు. కొన్ని కారణాల వల్ల ఆ పాత్రను సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. రజనీకాంత్ అందుకు అంగీకరిస్తాడో లేదో చూడాలి. రజనీకాంత్ ఈ సినిమా చేయడానికి అంగీకరిస్తే, సల్మాన్ ఖాన్ - రజనీకాంత్ మల్టీస్టారర్‌ని చూడటానికి భారీ ఆసక్తి చూపుతారు.

Next Story