ఇండియన్ ఐడల్ 3 విజేత ప్రశాంత్ తమంగ్ 43 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించారు. ఆదివారం (జనవరి 11) ఉదయం గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. కేవలం 43 ఏళ్ల వయసులో కెరీర్ పరంగా పూర్తి బిజీలో ఉన్న సమయంలో ప్రశాంత్ అకాల మరణం అభిమానులు, సంగీతప్రియులను శోకసంద్రంలో ముంచింది. ఈ విషాద వార్తను ఆయన సన్నిహితుడు, ప్రముఖ సంగీత దర్శకుడు రాజేష్ ఘటానీ ధృవీకరించారు
ప్రశాంత్ తమాంగ్ ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లో జరిగిన ఒక లైవ్ షోలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమం పూర్తయ్యాక దిల్లీకి తిరిగివచ్చారు. ఆదివారం ఉదయం తన నివాసంలో ఉండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ద్వారకాలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గతంలో ప్రశాంత్‌కు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, ఇది పూర్తిగా ఆకస్మికంగా జరిగిన ఘటన అని సన్నిహితులు పేర్కొన్నారు.