'ఇండియన్‌ 2' షూట్ పై క్రేజీ అప్ డేట్ ! 

Indian 2 Movie Shooting Starts From Tomorrow. టెక్ మాంత్రికుడు శంకర్ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా రాబోతున్న ఇండియన్‌ 2 

By Sumanth Varma k  Published on  20 Jan 2023 9:03 PM IST
ఇండియన్‌ 2  షూట్ పై క్రేజీ అప్ డేట్ ! 

టెక్ మాంత్రికుడు శంకర్ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా రాబోతున్న ఇండియన్‌ 2 గురించి ఓ క్రేజీ అప్ డేట్ తెలిసింది. ఈ భారీ సీక్వెల్ తదుపరి షెడ్యూల్ రేపటి నుంచి తిరుపతిలో ప్రారంభమవుతుంది. ఈ షెడ్యూల్ లో కమల్ హాసన్ తో పాటు కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ కూడా పాల్గొనబోతున్నారు. ఈ షెడ్యూల్ నాలుగు రోజుల పాటు జరుగుతుందని తెలుస్తోంది. తిరుపతి నేపథ్యంలో స్వామి వారి పై రెండు సీన్లు నడుస్తాయట. సినిమాలోనే ఎంతో కీలకం అయిన ఈ ఎమోషనల్ సీన్స్ ను శంకర్ భారీ విజువల్స్ తో తెరకెక్కించబోతున్నాడు.

ఇంకా 60-70 రోజులు షూటింగ్‌ పూర్తయితే ఇండియన్‌ 2 చిత్రీకరణ మొత్తం అయిపోయినట్టేనట. దీంతో ఇండియన్‌ 2 ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. ఇక యువ సంచలనం అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. టెక్ మాంత్రికుడు శంకర్ ఈ సినిమాని కూడా తన శైలిలోనే భారీ హంగులతోనే తీర్చిదిద్దడానికి ఇప్పటికే విదేశీ సాంకేతిక నిపుణులతో కూడా చర్చలు జరుపుతున్నాడు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

Next Story