భారతీయుడు-2 సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది

డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన సినిమా ఇండియన్ 2. ఈ చిత్రం జూలై 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది.

By Medi Samrat  Published on  5 July 2024 9:15 PM IST
భారతీయుడు-2 సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది

డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన సినిమా ఇండియన్ 2. ఈ చిత్రం జూలై 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. చిత్ర బృందం వివిధ వేదికలపై సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని ఫార్మాలిటీస్ కూడా పూర్తయ్యాయి. ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. తెలుగులో భారతీయుడు 2 పేరుతో విడుదలవుతున్న 'ఇండియన్ 2'కి సెన్సార్ బోర్డ్ అధికారికంగా U/A సర్టిఫికేట్ ఇచ్చింది. ఇండియన్ 2 రన్‌టైమ్ కూడా 180.04 నిమిషాలకు లాక్ చేశారు. అంటే సరిగ్గా 3 గంటలు.

ఇండియన్ 2 టీమ్ ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. ఇక ఇండియన్ 3ని త్వరలో ప్రారంభించాలని ఆశిస్తున్నారు. శంక‌ర్ కూడా అదే చెబుతున్నారు. కమల్ హాసన్ కూడా ఇండియన్ 2 కంటే ఇండియన్ 3పైనే ఎక్కువ ఆసక్తిని వ్యక్తం చేశారు. అన్నీ కలిసొస్తే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన పాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి. అయితే ట్రైలర్ కాస్త నిరాశపరిచింది. చిత్రబృందం విడుదలకు ముందే మరో ట్రైలర్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.

Next Story