విశ్వంభర.. మొదటి పాటకు వేళాయె

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సోషియో-ఫాంటసీ ఎంటర్‌టైనర్ 'విశ్వంభర' . ఈ సినిమా టీజర్ కు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది.

By అంజి  Published on  15 Feb 2025 7:30 PM IST
Chiranjeevi, Vishwambhara movie, Tollywood

విశ్వంభర.. మొదటి పాటకు వేళాయె 

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సోషియో-ఫాంటసీ ఎంటర్‌టైనర్ 'విశ్వంభర' . ఈ సినిమా టీజర్ కు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. వశిష్ట దర్శకత్వంలో, ప్రతిష్టాత్మక UV క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రం గ్రాండ్‌గా రూపుదిద్దుకుంటోంది. నిర్మాణం పూర్తి కావస్తుండగా తాజా షెడ్యూల్‌లో హైదరాబాద్‌లోని శంకర్‌పల్లిలో వేసిన భారీ సెట్‌లో చిరంజీవి ఇంట్రడక్షన్ సాంగ్ చిత్రీకరిస్తున్నారు.

ఎం.ఎం. కీరవాణి మాస్ గీతాన్ని కంపోజ్ చేయగా, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ శోబి మాస్టర్ డ్యాన్స్‌లను పర్యవేక్షిస్తున్నారు. బ్లాక్‌బస్టర్ బింబిసారతో అరంగేట్రం చేసిన దర్శకుడు వశిష్ట, తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా భావించే విశ్వంభరతో మరోసారి ఆకట్టుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. తన అభిమాన నటుడు, చిరంజీవితో కలిసి, వశిష్ట ఒక అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించాడు. అది విజువల్ అద్భుతంగా ఉంటుందని, టాప్-టైర్ VFX, హై-ఆక్టేన్ యాక్షన్, ఎమోషనల్‌గా ఆకట్టుకునే డ్రామాను మిళితం చేస్తుందని చెబుతున్నారు. త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ ప్రధాన పాత్రలు పోషించారు.

Next Story