ఇలియానాకు ఏమైంది..? ఆహారం తీసుకోలేని స్థితిలో ఆస్ప‌త్రి బెడ్‌పై గోవా బ్యూటీ

Ileana D Cruz hospitalized shares photos from hospital taking IV fluids.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 Jan 2023 11:51 AM IST
ఇలియానాకు ఏమైంది..? ఆహారం తీసుకోలేని స్థితిలో ఆస్ప‌త్రి బెడ్‌పై గోవా బ్యూటీ

ఇలియానా.. ప‌రిచ‌యం చేయాల్సి ప‌ని లేదు. 'దేవదాస్' చిత్రంతో టాలీవుడ్ ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను కొల్ల‌గొట్టిన ఈ గోవా బ్యూటీ అన‌తికాలంలో తెలుగులో స్టార్ హీరోయిన్‌గా కొన్నాళ్ల పాటు చ‌క్రం తిప్పింది. ఆ త‌రువాత బాలీవుడ్‌కు చెక్కేసింది. తెలుగులో చిత్రాల‌ను త‌గ్గించేసింది. ఇలా ఉంటే.. తాజాగా ఈ బ్యూటీ ఆస్ప‌త్రిలో చేరింది. క‌నీసం ఆహారం కూడా తీసుకోలేని స్థితిలో ఉంద‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఇలియానా సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది. చికిత్స తీసుకుంటున్న ఫోటోల‌ను షేర్ చేసింది.

అందులో చేతికి సెలైన్‌తో ఆసుపత్రి బెడ్‌పై పడుకున్న ఫోటో ఒక‌టి ఉండ‌గా.. దీంతో పాటు తాను ఆహారం తీసుకోలేని స్థితి ఉండగా వైద్యులు మూడు బాటిళ్ల సెలైన్ బాటిళ్లు ఎక్కించినట్లు రాసుకొచ్చింది. అయితే.. అనారోగ్యానికి గ‌ల కార‌ణాలు మాత్రం చెప్ప‌లేదు. ఇది చూసిన ఆమె అభిమానులు త‌ల్ల‌డిల్లిపోతున్నారు. ఆమె త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్నారు. దీన్ని చూసిన ఇలియానా.. మ‌రో ఫోటోను షేర్ చేస్తూ నా ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు. ఇంతగా నాపై ప్రేమ, అప్యాయత చూపిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞుతురాలిని. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. నాకు మంచి వైద్యం అందుతోంది అని రాసుకొచ్చింది.


అస‌లు ఇలియానాకు ఏమైంద‌ని ఆరా తీస్తుండ‌గా, దీనిపై ఇలియానా మ‌ద‌ర్‌ క్లారిటీ ఇచ్చారు. ఇలియానాకు ఫుడ్ పాయిజ‌న్ అయింద‌ని చెప్పారు. దీంతో పాటు డీహైడ్రేషన్ కు గురైంద‌ని తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగ్గా ఉందన్నారు.

Next Story