ఐకాన్‌స్టార్‌కు అరుదైన గౌరవం..ప్రముఖ మ్యాగజైన్‌ కవర్ పేజీపై స్థానం

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అకౌంట్‌లో మరో అరుదైన గౌవరం లభించింది.

By Knakam Karthik  Published on  20 Feb 2025 11:15 AM IST
Cinema News, Tollywood, Entertainment, AlluArjun, Pushpa 2, TheHollywoodReporterIndia

ఐకాన్‌స్టార్‌కు అరుదైన గౌరవం..ప్రముఖ మ్యాగజైన్‌ కవర్ పేజీపై స్థానం

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అకౌంట్‌లో మరో అరుదైన గౌవరం లభించింది. ప్రఖ్యాత హాలీవుడ్ సినిమా వార్తల మ్యాగజైన్ 'ది హాలీవుడ్ రిపోర్టర్' ఇప్పుడు ది 'హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా' పేరిట భారత్ లోనూ అలరించనుంది. భారత్ లో ఈ మ్యాగజైన్ తొలి సంచికను అల్లు అర్జున్ ముఖచిత్రంతో తీసుకువస్తుండడం విశేషం. అల్లు అర్జున్: ది రూల్ పేరిట కవర్ పేజీ కథనం కూడా రూపొందించారు. అల్లు అర్జున్ హీరోగా తెలుగులో తీసిన పుష్ప-2 చిత్రం హిందీ సినిమా చరిత్రను తిరగరాసిందని ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా పేర్కొంది. అల్లు అర్జున్ ను స్టార్ ఆఫ్ ఇండియా అని అభివర్ణించింది.

‘పుష్ప-2’ చిత్రం సృష్టించిన రికార్డుల గురించి రాస్తూ ఇలా కవర్ పేజీపై అల్లు అర్జున్ ఫొటోను ప్రింట్ చేశారు. దీంతో సినీ వర్గాలు షాక్‌కు గురవుతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమంటూ కితాబిస్తున్నారు. అయితే ఈ మ్యాగజైన్ చేసిన ఇంటర్వూలో అల్లు అర్జున్ తనకు తాను 5.5 రేటింగ్ ఇచ్చుకోవడం విశేషం. అయితే ఈ మేగజైన్ ఇండియాలో త్వరలో విడుదల కానుంది. ఈ మేగజైన్ చేసిన ఇంటర్వూలో అల్లు అర్జున్ పంచుకున్న విశేషాలను తెలుసుకోవాలని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

కాగా అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప-2: ది రూల్ చిత్రం వరల్డ్ వైడ్ రూ.1,871 కోట్లు వసూలు చేసి భారతీయ సినీ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదు చేసింది. తెలుగుతో పాటు పాన్ ఇండియా రేంజ్‌లో ఈ మూవీని విడుదల చేశారు. చిత్రంలో వైవిధ్యమైన సన్నివేశాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ మూవీ దేశంలోనే అత్యధికంగా వసూళ్లు రాబట్టిన రెండోదిగా నిలిచింది.

Next Story