చంచల్‌గూడ జైలు నుంచి ఐబొమ్మ రవి విడుదల (video)

ఇమంది రవి అలియాస్ ఐబొమ్మ రవి 90 రోజుల తర్వాత చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు.

By -  Knakam Karthik
Published on : 18 Feb 2026 7:35 PM IST

Hyderabad News, Chanchalguda Jail, iBOMMA Ravi, PiracyCase, TeluguCinema

చంచల్‌గూడ జైలు నుంచి ఐబొమ్మ రవి విడుదల (video)

సినిమాల పైరసీ కేసులో అరెస్టయిన ఐబొమ్మ (iBOMMA) నిర్వాహకుడు ఇమంది రవి అలియాస్ ఐబొమ్మ రవి 90 రోజుల తర్వాత చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనను అరెస్ట్ చేసిన నిర్ణీత గడువులోగా పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేయకపోవడంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

అయితే, రవికి బెయిల్ ఇస్తూనే కోర్టు 12 కఠిన షరతులను విధించింది. ప్రధానంగా ఆయన సోషల్ మీడియా అకౌంట్‌లను వాడకూడదని, ఇంటర్నెట్ మరియు వీపీఎన్ (VPN) వినియోగించకూడదని కోర్టు స్పష్టం చేసింది. దాదాపు మూడు నెలల పాటు రిమాండ్‌లో ఉన్న రవి, ఈ షరతులకు లోబడి బుధవారం జైలు నుంచి బయటకు వచ్చారు.

Next Story