టాలీవుడ్‌కి ఐ బొమ్మ మాస్‌ వార్నింగ్‌

ఐ బొమ్మ.. తెలుగు రాష్ట్రాల్లోని సినీ ప్రేక్షకులను ఈ పేరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఓటీటీలోకి వచ్చే ప్రతీ సినిమా ఐ బొమ్మలోకి వస్తుంది.

By అంజి  Published on  7 Sep 2023 2:30 AM GMT
I Bomma, Tollywood

టాలీవుడ్‌కి ఐ బొమ్మ మాస్‌ వార్నింగ్‌

ఐ బొమ్మ.. తెలుగు రాష్ట్రాల్లోని సినీ ప్రేక్షకులను ఈ పేరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లోకి వచ్చిన ప్రతీ సినిమా కొన్ని గంటల్లోనే ఐ బొమ్మ వెబ్‌సైట్‌లోకి వస్తుంది. రిలీజ్‌ అవడంతోనే సినిమాలు ఐ బొమ్మలోకి రావడం టాలీవుడ్‌ ఇండస్ట్రీకి పెను సవాల్‌గా మారింది. దీంతో టాలీవుడ్ ఈ వెబ్‌సైట్‌పై ఫోకస్ పెట్టింది. దీంతో టాలీవుడ్‌కు ఐ బొమ్మ మాస్‌ వార్నింగ్ ఇచ్చింది. ''మా వెబ్ సైట్ మీద ఫోకస్ చేయడం ఆపండి. మీరు మా మీద ఫోకస్ చేస్తే.. మాకు మీపై ఎక్కడ ఫోకస్ చేయాలో తెలుసు. మీరు డిస్ట్రిబ్యూటర్స్ కు ప్రింట్ అమ్మిన తర్వాత మీకు ఏమీ తెలియనట్లు కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ల మీద కాకుండా.. మీ ఓటీటీ రెవిన్యూ గురించి థింక్ చేస్తూ.. మాపై ఫోకస్ పెట్టారు. ఇక మా నుంచి మీకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి.

1. హీరోలకు అంత రెమ్యూనిరేషన్‌ అవసరమా? అది మీ కొడుకు అయినా ఎవరు అయినా..

2. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. వాళ్లు ఏం అయిపోతారు అని కబుర్లు చెప్పకండి.. వాళ్లకి మీరు ఇచ్చే అమౌంట్‌ ఏ కూలి పని చేసిన వస్తాయి.. కానీ మీ హీరోకి హీరోయిన్‌కి వస్తాయా?

3. సినిమా బడ్జెట్‌లో ఎక్కువ శాతం రెమ్యూనరేషన్స్‌, విదేశాల్లో షూటింగ్‌లకు, ట్రిప్స్‌కి ఖర్చు పెడుతున్నారు. ప్రొడక్షన్‌ బాయ్స్‌ నుంచి లైట్‌ బాయ్స్‌ వరకు ఎంత ఖర్చు పెడుతున్నారు? ఇండియాలో షూటింగ్‌ చేస్తే బడ్జెట్‌ తగ్గుతుంది కదా? అక్కడి వాళ్లకి ఉపాధి కలుగుతుంది కదా?

4. అనవసర బడ్జెట్‌ పెట్టి ఆ బడ్జెట్‌ రికావెరీని మా మీద రుద్ది ఎక్కువకి అమ్ముతున్నారు. డిస్ట్రిబ్యూటర్స్‌ అండ్‌ థియేటర్‌ ఓనర్స్‌ ఆ అమౌంట్‌ని కలెక్ట్‌ చేసుకోవడానికి టికెట్‌ అమౌంట్‌ పెంచుతున్నారు. చివరికి మధ్య తరగతి వాడే బాధపడుతున్నాడు.

మా వెబ్‌సైట్‌ మీద ఫోకస్‌ చేయడం ఆపండి.. లేదంటే నేను మీ మీద ఫోకస్‌ చేయాల్సి వస్తుంది. ఫస్ట్‌ వేరే కెమెరా ప్రింట్స్స్‌ రిలీజ్‌ చేసే వెబ్‌సైట్ల మీద మీ దృష్టి పెట్టండి. ఐ బొమ్మ అనేది సిగరేట్‌ నుంచి e-సిగరేట్‌కు యూజర్స్‌ని మళ్లించే ప్రక్రియ. మీ యాక్షన్‌కి నా రియాక్షన్‌ ఉంటుంది. ఈ మిడిల్‌లో వేరే ఏ హీరో కూడా (ఎగ్జాంపుల్‌: విజయ్) టార్గెట్‌ అవ్వటం ఇష్టం లేదు. మేము స్వతహాగా వెబ్‌సైట్‌ నుంచి తొలగిస్తున్నాం. ఇప్పుడు ఇమ్మీడియేట్‌ డిలీట్‌ చేస్తే మీకు భయపడి లేదా మీరు తీయించినట్టు ఉంటది. అందుకే ఈ పోస్ట్‌ చేసిన కొన్ని గంటల తర్వాత తీసివేయాలని అనుకుంటున్నాం.. ఐ బొమ్మ వాళ్లు ఇండియాలో తీసివేసిన తర్వాత వాళ్లని రిక్వెస్ట్‌ చేసి టెక్నాలజీ షేర్‌ చేయాలని కోరాం. దానికి వాళ్లు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు వాళ్లు కూడా షేర్‌ చేయడం లేదు. మేం ఐబొమ్మ వాళ్లంతా మంచివాళ్లం కాదు. బురదలో రాయి వేయకండి. అది కూడా పెంట మీద అసలు వేయకండి. మేం ఏ దేశంలో ఉన్నా భారతదేశం, అందులో తెలుగు వారి కోసం ఆలోచిస్తాం. చావుకు భయపడని వాడు.. దేనికి భయపడడు'' అంటూ ఓ నోట్‌ ద్వారా మాస్‌ వార్నింగ్‌ ఇచ్చింది.

Next Story