బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ కుటుంబంలో విషాదం

Hrithik Roshan’s maternal grandmother Padma Rani Omprakash dies at 91.బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ కుటుంబంలో విషాదం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Jun 2022 11:53 AM IST
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ కుటుంబంలో విషాదం

బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. హృతిక్ రోషన్ అమ్మమ్మ, పద్మా రాణి ఓంప్రకాష్ జూన్ 16న 91 ఏళ్ల వయసులో ముంబైలో కన్నుమూశారు. ఆమె తీవ్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతూ మంచం పట్టారు. వయసు సంబంధిత సమస్యల కారణంగా హృతిక్ అమ్మమ్మ గత రెండేళ్లుగా రోషన్ కుటుంబంతో కలిసి ఉంటోంది.

పద్మా రాణి ఓంప్రకాష్ ప్రముఖ సినీ నిర్మాత జె ఓం ప్రకాష్ భార్య. హృతిక్ తల్లి పింకీ రోషన్‌కు తల్లిదండ్రులు. J ఓం ప్రకాష్ తన 93 సంవత్సరాల వయస్సులో ఆగష్టు 7, 2019న కన్నుమూశారు. ఆయన 1974లో రాజేష్ ఖన్నా హీరోగా నటించిన 'ఆప్ కీ కసమ్‌' తో తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అప్నా బనా లో (1982), అప్నాపన్ (1977), ఆషా (1980), అర్పన్ (1983) మరియు ఆద్మీ ఖిలోనా హై (1993) లో జీతేంద్రతో కలిసి పనిచేసినందుకు అతను బాగా పేరు పొందాడు. అతను ఆయీ మిలన్ కి బేలా (1964), ఆస్ కా పంచీ (1961), ఆయే దిన్ బహర్ కే (1966), ఆంఖోన్ ఆంఖోన్ మే, అయా సావన్ ఝూమ్ కే (1969) వంటి బాక్సాఫీస్ హిట్ చిత్రాలను కూడా నిర్మించారు.

Next Story