ఆక‌ట్టుకుంటోన్న 'అహ నా పెళ్ళంట' టీజర్

Hilarious Teaser Of Telugu Web Series 'Aha Na Pellanta' Released.రాజ్ త‌రుణ్ అహ నా పెళ్లంట వెబ్ సిరీస్‌తో ఓటీటీలో సంద‌డి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Nov 2022 10:40 AM IST
ఆక‌ట్టుకుంటోన్న అహ నా పెళ్ళంట టీజర్

ప్ర‌స్తుతం వెబ్ సిరీస్‌ల హ‌వా న‌డుస్తోంది. దీంతో చాలా మంది సెల‌బ్రెటీలు వెబ్‌సిరీస్‌ల‌లో న‌టించేందుకు ముందుకు వ‌స్తున్నారు. ఇక ఇదే బాట‌లో హీరో రాజ్ త‌రుణ్ కూడా వ‌చ్చేశాడు. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వ‌రుస చిత్రాల‌ను చేస్తున్న రాజ్ త‌రుణ్ 'అహ నా పెళ్లంట' వెబ్ సిరీస్‌తో ఓటీటీలో సంద‌డి చేయ‌నున్నాడు.

ఇప్ప‌టి నుంచి నా పెళ్లి అయ్యేంత వ‌ర‌కూ నేను ఏ అమ్మాయి వెంట ప‌డ‌ను అని ఓ బాలుడు త‌న త‌ల్లికి ప్ర‌మాణం చేస్తాడు. క‌ట్ చేస్తే.. పెరిగి పెద్ద‌వాడు అయ్యాక పెళ్లి చేసుకుంటాను సంబంధాలు చూడమని హీరో ఇంట్లో చెప్తే.. తీరా పెళ్లి ఫిక్స్ అయ్యాక తన లైఫ్ లోకి ఇంకో అమ్మాయి వస్తుంది. త‌ల్లి చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా..? ప్రేమించిన అమ్మాయితో ఏడ‌డుగులు వేశాడా.. ? తెలియాంటే అహ నా పెళ్లంట చూడాల్సిందే.

తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. టీజ‌ర్ ఆద్యంతం ఆస‌క్తిగా సాగింది. కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సిరీస్ రూపుదిద్దుకున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది. రాజ్‌త‌రుణ్‌, శివానీ రాజ‌శేఖ‌ర్ జంట‌గా న‌టించిన ఈ వెబ్ సిరీస్ 'జీ-5'లో నవంబర్‌ 17నుండి స్ట్రీమింగ్‌ కానుంది

Next Story