ఉత్తమ నటిగా తాప్సీ పన్ను.. ఇది థర్డ్‌ టైమ్‌

Heroine Taapsee Got Best Actress Award Third Time. ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్ను.. 'ఝుమ్మంది నాదం' సినిమాతో మొదటి సారిగా సిల్వర్‌ స్క్రీన్‌పై

By అంజి  Published on  22 Dec 2022 8:15 PM IST
ఉత్తమ నటిగా తాప్సీ పన్ను.. ఇది థర్డ్‌ టైమ్‌

ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్ను.. 'ఝుమ్మంది నాదం' సినిమాతో మొదటి సారిగా సిల్వర్‌ స్క్రీన్‌పై మెరిసింది. ఆ తర్వాత తెలుగు, తమిళ్‌తో పాటు హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఓ వైపు భారీ ప్రాజెక్టుల్లో నటిస్తూ, మరోవైపు ఓటీటీ వెబ్‌ సిరీస్‌లు చేస్తోంది. తాజాగా తాప్సీ నటించిన వెబ్‌ ఒరిజనల్‌ ఫిలిం 'లూప్‌ ల పేటా'. ఈ మూవీకి గాను ఉత్తమ నటిగా తాప్సీ ఫిలింఫేర్‌ ఓటీటీ అవార్డును అందుకుంది. సాండ్‌ కీ ఆంఖ్‌ (2020), థప్పడ్‌ (2021) చిత్రాల తర్వాత తాప్సీ ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకోవడం ఇది మూడోసారి.

''లూప్‌ లపేటా సినిమాను నేనెందుకు చేయాలనుకుంటున్నానో.. రన్ లోలా రన్ లాంటి క్లాసిక్‌ని నేను ఎందుకు టచ్ చేయాలనుకుంటున్నానో ఎవరికీ అర్థం కాలేదు.. '' అని ఫిలింఫేర్‌ ఓటీటీ అవార్డు గెలుచుకున్న తర్వాత తాప్సీ సోషల్ మీడియాలో పోస్ట్‌ పెట్టింది. ప్రస్తుతం ఈ భామ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. తమిళంలో జనగణమన, ఏలియన్ చిత్రాల్లో నటిస్తోంది. హిందీలో 'వో లడ్‌కీ హై కహాన్‌'తో పాటు రాజ్‌కుమార్‌ హిరానీ డైరెక్షన్‌లో షారుఖ్‌ ఖాన్ హీరోగా నటిస్తోన్న 'డుంకీ' సినిమాలో ఫీ మేల్ లీడ్ రోల్‌ చేస్తోంది.

తాప్సీ పన్ను విమర్శకుల ప్రశంసలు పొందిన 'పింక్', 'నామ్ షబానా', 'సూర్మ', 'ముల్క్', 'మన్మర్జియాన్', 'తప్పడ్' వంటి హిట్ చిత్రాలలో తన మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె 'గేమ్ ఓవర్', 'బద్లా', 'సాంద్ కి ఆంఖ్', 'మిషన్ మంగళ్' వంటి చిత్రాలలో కూడా నటించింది. ఈ నటి ఇటీవల 'బ్లర్', 'దోబారా' అనే థ్రిల్లర్‌లలో నటించింది.

Next Story