క్రిష్ పెళ్లి పెటాకులు అవ్వడానికి కారణమైన హీరోయిన్ ఎవరా అంటూ ఆరా..!

Heroine Reason For Krish's Divorce.ఒక్కసారిగా తెలుగు మీడియా ఛానల్స్ లో క్రిష్ పెళ్లి పెటాకులు అవ్వడానికి కారణం ఓ హీరోయిన్ అంటూ వార్తలు వచ్చాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 May 2021 12:50 PM GMT
krish divorce

క్రిష్.. రాధాకృష్ణ జాగర్లమూడి.. నేషనల్ అవార్డు విన్నర్ గా పేరు తెచ్చుకున్నాడు. భాషలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రస్తుతం తెలుగులో పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం క్రిష్ పర్సనల్ లైఫ్ గురించి తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది. ఒక్కసారిగా తెలుగు మీడియా ఛానల్స్ లో క్రిష్ పెళ్లి పెటాకులు అవ్వడానికి కారణం ఓ హీరోయిన్ అంటూ వార్తలు వచ్చాయి. దీంతో ఆ విషయంపై నెటిజన్లు తెగ చర్చిస్తూ ఉన్నారు. క్రిష్ 2016 ఆగ‌స్ట్ 7న ర‌మ్య అనే డాక్ట‌ర్‌ను వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

రెండేళ్లు వీరి సంసారం స‌జావుగానే సాగినప్పటికీ ఆ త‌ర్వాత వీరిద్ద‌రి మధ్య పెద్ద ఎత్తున విబేధాలు వచ్చాయి. 2018లో వీరు కోర్టుని ఆశ్ర‌యించ‌గా, ఆ వెంటనే విడాకులు మంజూరు అయ్యాయి. త‌న సినిమాలో న‌టించిన హీరోయిన్‌తో క్రిష్ చ‌నువుగా ఉండ‌డం రమ్య‌కు న‌చ్చ‌క‌పోవ‌డంతో విడాకులు ఇచ్చేసింద‌ని అంటున్నారు. ఇంతకూ క్రిష్ అంత చనువుగా ఉన్న హీరోయిన్ ఎవరా..? అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. క్రిష్ కానీ.. రమ్య కానీ.. ఆ తర్వాత విడిపోడానికి కారణం ఇది అంటూ ఎటువంటి స్టేట్మెంట్లు ఇవ్వలేదు. ప్ర‌స్తుతం క్రిష్‌.. ప‌వ‌న్ కళ్యాణ్ హీరోగా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా తెర‌కెక్కిస్తుండ‌గా, ప్ర‌స్తుతం క‌రోనా వ‌ల‌న షూటింగ్‌కు బ్రేక్ ప‌డింది. ఎవరూ ఊహించని విధంగా క్రిష్ పెళ్లి ప్రస్తావనలో మీడియాలో మళ్లీ ఎందుకు హైలైట్ అవుతోందో తెలియడం లేదు.
Next Story
Share it