స్క్రిప్ట్ నమ్మే సినిమాలు చేస్తా.. ఆ వార్తలను ఖండించిన రష్మిక
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ వార్తపై హీరోయిన్ రష్మిక మందన్నా క్లారిటీ ఇచ్చింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 13 Feb 2024 9:45 PM ISTస్క్రిప్ట్ నమ్మే సినిమాలు చేస్తా.. ఆ వార్తలను ఖండించిన రష్మిక
శర్వానంద్ హీరోగా.. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన సినిమా 'ఆడవాళ్ళూ మీకు జోహార్లు'. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ ఈ సినిమాను నిర్మించారు. 2022 లో రిలీజ్ అయిన ఈ సినిమా అంత గొప్ప సక్సెస్ అవ్వలేదు. ఈ సినిమా గురించి రష్మిక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. ” ఆడవాళ్లు మీకు జోహార్లు కథ నాకు నచ్చలేదు. కానీ, కిషోర్ తిరుమల కోసం, శర్వా కోసం ఆ సినిమా సైన్ చేశాను” అని చెప్పుకొచ్చింది. ఇక ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.
ఈ వార్తలపై రష్మిక స్పందించింది. ఓ నెటిజన్ చేసిన పోస్టు గురించి సమాధానమిస్తూ.. “ఎవరు చెప్పారు? నేను స్క్రిప్ట్‌ను నమ్మి మాత్రమే సినిమాలు చేస్తాను. నటీనటులు, సిబ్బందితో కలిసి పనిచేయడం ఎంతో గౌరవంగా ఉంటుంది. ఈ నిరాధారమైన వార్తలన్నీ ఎక్కడ నుండి మొదలవుతాయో తెలియదు." అని కూల్ గా చెప్పేసింది. రష్మిక చేసిన పోస్టుకు మద్దతు లభిస్తూ ఉంది. అనిమల్ తో భారీ సక్సెస్ ను అందుకున్న రష్మిక.. 2024 లో కూడా మంచి లైనప్ తో వస్తోంది. పుష్ప: ది రూల్‌తో పాటు.. రష్మిక 'ది గర్ల్‌ఫ్రెండ్' అనే చిత్రానికి కూడా సంతకం చేసింది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. నితిన్-వెంకీ కుడుములతో ఒక ప్రాజెక్ట్ కు కూడా సంతకం చేసింది. రష్మిక బాలీవుడ్ ప్రాజెక్ట్ లిస్ట్ లో 'చావా' సినిమా కూడా ఉంది. ఆమె విక్కీ కౌశల్ సరసన నటిస్తోంది.