డైరెక్టర్ త్రివిక్రమ్‌పై తాను చేసిన ఫిర్యాదుపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ చర్యలు తీసుకోలేదని హీరోయిన్ పూనమ్ కౌర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై నటుడు, మా ట్రెజరర్ శివ బాలాజీ స్పందించారు. పూనమ్ కౌర్ నుంచి 'మా' కు ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు. గతంలో కూడా ఫిర్యాదు చేసినట్టు రికార్డుల్లోనూ లేదని తెలిపారు. ట్వీట్లు చేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. 'మా' ను లేదా కోర్టును ఆశ్రయిస్తే న్యాయం జరుగుతుందని శివబాలాజీ తెలిపారు.
''త్రివిక్రమ్‌పై చాలా కాలం కిందట 'మా'లో ఫిర్యాదు చేశా. అయినా అతడిని ప్రశ్నించలేదు.. చర్యలు తీసుకోలేదు. నా ఆరోగ్యం, సంతోషాన్ని నాశనం చేసిన అతడిని పెద్ద తలకాయలు కాపాడుతున్నాయి'' అని పూనమ్ కౌర్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. త్రివిక్రమ్ తనతో పాటు ఎంతో మంది జీవితాలను నాశనం చేశాడని పూనమ్ కౌర్ పలుమార్లు ఆరోపించిన విషయం తెలిసిందే.