'ఆ వ్యక్తి ఆరేళ్లుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు'.. నిత్యా మేనన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Heroine Nithya Menon shocking comments about her wedding. హీరోయిన్‌ నిత్యా మేనన్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. సంతోష్‌ వర్కీ అనే వ్యక్తి తనను 6 ఏళ్ల నుంచి ప్రేమిస్తున్నానంటూ

By అంజి  Published on  7 Aug 2022 3:04 PM IST
ఆ వ్యక్తి ఆరేళ్లుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు.. నిత్యా మేనన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

హీరోయిన్‌ నిత్యా మేనన్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. సంతోష్‌ వర్కీ అనే వ్యక్తి తనను 6 ఏళ్ల నుంచి ప్రేమిస్తున్నానంటూ వేధింపులకు గురి చేస్తున్నాడని చెప్పింది. ఇటీవల తన మ్యారేజ్‌ గురించి జరిగిన ప్రచారంపై తాజాగా నిత్యా మేనన్‌ స్పందించింది. ఈ క్రమంలోనే సంతోష్‌ అనే వ్యక్తిపై పలు ఆరోపణలు చేసింది. కొన్ని రోజులుగా తన మ్యారేజ్‌ గురించి సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టడానికి ప్రధాన కారణం సంతోష్‌ వర్కీ అనే యూట్యబర్‌ అని తెలిపింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాడని, అప్పటి నుంచి ఈ వార్తలు వస్తున్నాయని చెప్పింది. నిజంగా చెప్పాలంటే.. ఆ వ్యక్తి దాదాపు ఆరేళ్ల నుంచి తనను, తన ఫ్యామిలీని వేధిస్తున్నాడని, వేరు వేరు ఫోన్‌ నంబర్ల నుంచి తనకు ఫోన్‌ చేసేవాడని నిత్యా మేనన్ చెప్పింది. దాదాపు 30 నంబర్లు బ్లాక్‌ చేశానంది. తన తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి విసిగించేవాడని, దీంతో తమ ఇంట్లోవాళ్లు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎన్నోసార్లు చెప్పారంది. అయితే తాను అలా చేయకుండా క్షమించి వదిలేశానని చెప్పుకొచ్చింది.

అతడు మెంటల్‌ కండిషన్‌ బాగోలేదనుకుంటా, వదిలేద్దాం అని ఇంట్లో వాళ్లాకు చెప్పానని, కానీ అతడు ఇంకా మారలేదంది. తన పెళ్లి గురించి సంతోష్‌ అనే వ్యక్తి ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేస్తున్నాడని వివరించింది. ఇక ఇటీవలో ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో నిత్యామేనన్ పెళ్లి జరగబోతోందంటూ జోరుగా ప్రచారం సాగింది. చాలా కాలం నుంచి ఆమె ఓ వ్యాపారవేత్తతో ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ అవాస్తవమంటూ ఓ వీడియో ద్వారా నిత్యా మేనన్‌ ఆ వార్తలకు చెక్‌ పెట్టింది.

Next Story