ముద్దు సీన్లలో నటిస్తే తప్పేంటి?: అనుపమ

స్టోరీ డిమాండ్‌ చేస్తే లిప్‌ లాక్‌ సీన్స్‌లో నటించడం తప్పేం కాదని హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ అన్నారు. తాను ఇప్పుడు నటిగా చాలా పరిణతి చెందానన్నారు.

By అంజి  Published on  7 April 2024 9:38 AM IST
Heroine Anupama parameswaran, tillu square, Tollywood

ముద్దు సీన్లలో నటిస్తే తప్పేంటి?: అనుపమ

స్టోరీ డిమాండ్‌ చేస్తే లిప్‌ లాక్‌ సీన్స్‌లో నటించడం తప్పేం కాదని హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ అన్నారు. తాను ఇప్పుడు నటిగా చాలా పరిణతి చెందానని, ఒకే తరహా పాత్రల్లో నటించి బోర్‌ కొడుతోందని అన్నారు. టిల్లు స్క్వేర్‌ సినిమాలో లిప్‌ లాక్‌ సీన్‌లో నటించడాన్ని కొంత మంది తప్పుబడుతున్నారని, ఆ సినిమా చూడకుండా వారు విమర్శిస్తున్నారని, అలా చేయడం కరెక్ట్‌ కాదని అన్నారు. సినిమా చూసి మాట్లాడాలి అంటూ అనుపమ ఫైర్‌ అయ్యారు.

అనుపమ పరమేశ్వరన్‌ మలయాళంలో 'ప్రేమమ్‌' సినిమాతో పాపులర్‌ అయింది. ఆ సినిమా ద్వారా అనుపమకు తెలుగులోనూ చాలా సినిమా అవకాశాలు వచ్చాయి. అనుపమ చివరిసారిగా తెలుగు చిత్రం కార్తికేయ 2 లో కనిపించింది. ఈ చిత్రం ఆగస్ట్ 13, 2022న విడుదలైంది. మంచి స్పందన లభించింది. ఆ తర్వాత నిఖిల్, అనుపమ జంటగా నటించిన '18 పేజీస్‌' కూడా మంచి విజయం సాధించింది. టిల్లు స్క్వేర్‌ మరో బంపర్ హిట్. వరుస సినిమాలతో రాణిస్తున్న అనుపమ తాజాగా టిల్లు స్క్వేర్‌తో మరో పెద్ద హిట్ అందుకుంది. భారీ అంచనాల నడుమ మార్చి 29న విడుదలైన ఈ చిత్రం బంపర్ హిట్‌గా నిలిచింది. కాగా, ఈ నటి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

Next Story