నేను పెళ్లి చేసుకోను: హీరోయిన్

తాను పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదని హీరోయిన్‌ ఆండ్రియా జెర్మియా తెలిపారు. తనకు 25 ఏళ్లు ఉన్నప్పుడు పెళ్లి ఆలోచన వచ్చిందని, కానీ ఎందుకో కుదరలేదన్నారు.

By అంజి  Published on  28 Feb 2024 12:07 PM IST
Heroine Andrea Jeremiah, marriage, Tollywood

నేను పెళ్లి చేసుకోను: హీరోయిన్

తాను పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదని హీరోయిన్‌ ఆండ్రియా జెర్మియా తెలిపారు. తనకు 25 ఏళ్లు ఉన్నప్పుడు పెళ్లి ఆలోచన వచ్చిందని, కానీ ఎందుకో కుదరలేదన్నారు. తన వయస్సు ఇప్పుడు 40 అని, ఇక వివాహం చేసుకోవాలని అనుకోవడం లేదన్నారు. పెళ్లి చేసుకోకపోయినా సంతోషంగానే ఉంటానన్నారు. తాను ఒంటరి జీవితానికి అలవాటు పడిపోయానని చెప్పారు. అయినా పెళ్లి చేసుకున్న వాళ్లు ఎంతమంది సంతోషంగా ఉన్నారని ఎదురు ప్రశ్న వేసింది. ఆండ్రియా బోల్డ్‌ అండ్‌ బ్యూటీఫుల్‌. నటిగా ఆడపాదడపా సినిమాలు చేస్తోంది.

కాగా ఇటీవల విడుదలై 'సైంధవ్' మూవీలో ఆండ్రియా నటించారు. ఈమె నటించిన 'పిశాచి 2' మూవీ త్వరలో థియేటర్లలోకి రానుంది. గతంలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌తో ఆండ్రియా డేటింగ్ చేసినట్లు టాక్. అప్పట్లో అనిరుధ్‌ని ముద్దు పెట్టుకున్న ఫొటో ఒకటి అప్పట్లో వైరల్ అయింది. ఆ తర్వాత బ్రేకప్ జరిగిందో? ఏమో.. అందుకే పెళ్లంటే విరక్తి వచ్చేసి ఇలా మాట్లాడుతుందా అనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. మరో హీరోయిన్‌ త్రిషకు నాలుగు పదుల వయసు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. కానీ లేటు అయినా సరే పెళ్లి చేసుకుంటానని చెబుతోంది.

Next Story