'హనుమాన్' ట్రైలర్ వచ్చేసింది
హీరో తేజా సజ్జా కొత్త సినిమా 'హనుమాన్'. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యింది.
By అంజి Published on 19 Dec 2023 12:02 PM IST
'హనుమాన్' ట్రైలర్ వచ్చేసింది!
హీరో తేజా సజ్జా కొత్త సినిమా 'హనుమాన్'. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యింది. తెలుగులో తొలి సూపర్ మీరో మూవీగా ఈ సినిమా వస్తోంది. 'కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట హనుమాన్ ఉంటాడు' వంటి డైలాగులతో ఈ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. స్టన్నింగ్ విజువల్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లతో ట్రైలర్ సినీ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. హనుమంతుడి సాయంతో సూపర్ పవర్స్ సొంతం చేసుకున్న యువకుడిగా తేజా సజ్జా ఈ సినిమాలో కనిపించనున్నట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. హనుమంతుడి సోత్రాలతో ఈ ట్రైలర్ ఆసక్తికరంగా ప్రారంభమైంది.
తేజా సజ్జా.. కుస్తీ వీరులను ఒక్క దెబ్బతో మట్టి కరిపించినట్లుగా ట్రైలర్‌లో చూపించారు. కరుడుగట్టిన విలన్‌గా వినయ్ రాయ్ ట్రైలర్‌లో ఎంట్రీ ఇచ్చాడు. తేజా సజ్జాపై ఎటాక్ చేయడానికి వచ్చిన రౌడీలను వీర లెవెల్ దంచికొడుతూ వరలక్ష్మి శరత్‌కుమార్ వచ్చిన యాక్షన్ ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. ట్రైలర్ చివరలో మానవాళి మనుగడను కాపాడటానికి నీ రాక అనివార్యం హనుమా అనే డైలాగ్ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే వచ్చిన టీజర్, పాటలు ఆకట్టుకున్నాయి. ఈ సినిమా 11 భాషల్లో విడుదల కానుంది. మంగళవారం హనుమంతుడికి ఇష్టమైన రోజు కావడంతో ఈ రోజు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తోంది.