'హంట్‌' ఫస్ట్‌ సింగిల్ రిలీజ్‌.. పాపతో పైలం అంటూ..

Hero Sudheer Babus Hunt Movie First Single Released. సుధీర్‌బాబుకు 'సమ్మోహనం' సినిమాతో బిగ్‌ బ్రేక్‌ ఇచ్చింది. అయితే సుధీర్‌ బాబు రిజల్ట్స్‌తో సంబంధం లేకుండా

By అంజి  Published on  11 Oct 2022 11:40 AM IST
హంట్‌ ఫస్ట్‌ సింగిల్ రిలీజ్‌.. పాపతో పైలం అంటూ..

సుధీర్‌బాబుకు 'సమ్మోహనం' సినిమాతో బిగ్‌ బ్రేక్‌ ఇచ్చింది. అయితే సుధీర్‌ బాబు రిజల్ట్స్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్‌ స్పెషల్‌ ఇమేజ్‌ తెచ్చుకున్నాడు. ఇటీవల సుధీర్‌బాబు నటించిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' మూవీ కూడా పాజిటివ్ టాక్‌ తెచ్చుకున్నా.. బ్రేక్‌ ఈవెన్‌ను మాత్రం సాధించలేదు. ఈ క్రమంలోనే సుధీర్‌ బాబు కథల ఎంపికలు ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం ఈ హీరో లేటెస్ట్‌గా నటిస్తున్న సినిమా 'హంట్‌'. ఈ సినిమాతో మహేష్‌ సూరపనేని దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మరోవైపు ఈ మూవీ సుధీర్‌బాబు కెరీర్‌లోనే ఎక్కువ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మూవీ. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్‌, టీజర్‌లు ఆసక్తిని పెంచాయి.

తాజాగా ఈ సినిమాలో ని పాపతో పైలం అంటూ సాగే మస్‌ బీట్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. జిబ్రాన్‌ స్వర పరిచిన ఈ పాటను మంగ్లీ, నకాష్‌ అజీజ్‌ ఆలపించగా.. కాసర్ల శ్యామ్‌ రచించాడు. సుధీర్‌బాబుతో కలిసి అప్సరరాణి ఈ పాటకు చిందులేసింది. ఈ మూవీలో సుధీర్‌బాబు గజిని తరహాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సుధీర్‌ డ్యుయెల్‌ రోల్‌లో నటిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి మహేష్ దర్శకత్వం వహించాడు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటుంది. కాగా ఈ చిత్రం నవంబర్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే మేకర్స్‌ వరుస అప్‌డేట్‌లను ఇస్తున్నారు.


Next Story