'కదా.. రా' అంటూ ఏపీ బీజేపీ నేతను లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసిన సిద్ధార్థ

Hero Siddharth Fires on BJP Leader. మరోసారి సిద్ధార్థ వార్తల్లో నిలిచారు. కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్యను సిద్ధార్థ్ తీవ్రంగా విమర్శించారు.

By Medi Samrat  Published on  7 May 2021 10:41 AM GMT
Siddart fires on BJP leader

హీరో సిద్ధార్థ్ అటు సినిమాలు చేసుకుంటూ.. ఇటు రాజకీయాల గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీపై హీరో సిద్ధార్థ తన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తీవ్ర విమర్శలు చేస్తూనే ఉంటారు. కొద్దిరోజుల కిందట కూడా భారతీయ జనతా పార్టీ నేతల మీద విమర్శలు చేస్తే ఆ పార్టీ నాయకులు సిద్ధార్థ ఫోన్ నెంబర్ ను లీక్ చేశారని ఆరోపణలు చేశారు. దీంతో సిద్ధార్థ తన ఫోన్ నెంబర్ బీజేపీ సెల్ నుండే బయటకు వచ్చిందని ఆరోపణలు గుప్పించారు. తనకు బెదిరింపులు వస్తున్నాయని.. తన ఇంట్లో వాళ్ళ గురించి కూడా అసహ్యంగా మాట్లాడుతూ ఉన్నారని సిద్ధార్థ చెప్పుకొచ్చారు.

ఇప్పుడు మరోసారి సిద్ధార్థ వార్తల్లో నిలిచారు. కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్యను సిద్ధార్థ్ తీవ్రంగా విమర్శించారు. తేజస్విని సిద్ధార్థ్ టెర్రరిస్టుతో పోల్చడంతో పలువురు బీజేపీ నాయకులు సిద్ధార్థ మీద విమర్శల వర్షం కురిపించింది. ఇక సిద్ధార్థ్ పై ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. సిద్ధార్థ్ సినిమాలకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం డబ్బులు ఇస్తున్నాడని విష్ణు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై సిద్ధార్థ్ ట్విట్టర్ ద్వారా కౌంటర్ వేశారు. తాను అసలైన భారతీయుడినని, సక్రమంగా పన్నులు కడుతున్నానని అన్నారు. 'లేదురా. నా టీడీఎస్ చెల్లించడానికి ఆయన రెడీగా లేడు. నేను అసలైన భారతీయుడిని, ట్యాక్స్ పేయర్ కదరా విష్ణు. వెళ్లి పడుకో. బీజేపీ స్టేట్ సెక్రటరీ అంట. సిగ్గుండాలి' అంటూ భారీగానే కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం సిద్ధార్థ్ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇక సిద్ధార్థ్ వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోకూడదని బీజేపీ అధిష్టానం ఆ పార్టీ నాయకులకు సూచన చేసింది.


Next Story
Share it