పెళ్లి వార్త‌ల‌పై స్పందించిన హీరో రామ్‌.. వాళ్ల‌ను కూడా న‌మ్మించాల్సి వ‌స్తుంది అంటూ ట్వీట్‌

Hero Ram Pothineni Clarification on his marriage news.హీరో రామ్ పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్త‌ ఇటీవ‌ల సోష‌ల్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Jun 2022 10:53 AM IST
పెళ్లి వార్త‌ల‌పై స్పందించిన హీరో రామ్‌.. వాళ్ల‌ను కూడా న‌మ్మించాల్సి వ‌స్తుంది అంటూ ట్వీట్‌

హీరో రామ్ పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్త‌ ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. కొన్ని వైబ్‌సైట్ల‌లో అయితే అమ్మాయి కూడా ఫిక్స్ అయింద‌ని, ఆ అమ్మాయి ఎవ‌రో కాద‌ని, రామ్ స్కూల్ మేట్ అని వార్త‌లు వ‌చ్చాయి. తన పెళ్లి విషయాన్ని రామ్ అతి త్వరలోనే అందరితో పంచుకుంటాడని ప్రచారం జరుగుతోంది. ఈ వార్త‌లు రోజు రోజుకు పెరిగిపోతుండ‌డంతో హీరో రామ్ తొలిసారి స్పందించాడు. ఇక ఆపండి రా బాబు. మీ వ‌ల్ల మా ఇంట్లో వాళ్ల‌తో పాటు నా ప్రాణ స్నేహితుల‌ని కూడా న‌మ్మించాల్సి వ‌స్తుంది అంటూ అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు.

సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ని చెప్పేశాడు. అవ‌న్నీపుకార్లేన‌ని స్ప‌ష్టం చేశాడు. అసత్య ప్ర‌చారాల వ‌ల్ల అయిన వాళ్ల‌కే స‌మాధానం చెప్పుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నాడు. 'ఓరి దేవుడా..!! ఇక‌నైనా ఆపండి . త‌న ప‌రిస్థితి ఎంత‌లా దిగ‌జారిందంటే చివ‌రికి హైస్కూల్ స్వీట్‌హార్ట్ అంటూ నాకు ఎరూ లేరని, నేను ఎవ‌ర్నీ పెళ్లి చేసుకోవ‌డం లేద‌ని ఇంట్లోవాళ్లు, ప్రాణ‌మిత్రుల‌ను సైతం న‌మ్మించాల్సి వ‌స్తోంది. ఇంకో విష‌యం ఏంటంటే.. ఆ రోజుల్లో నేను అస‌లు స్కూల్‌కే స‌రిగ్గా వెళ్ల‌లేదు' అని రామ్ ట్వీట్ చేశాడు.

ఎట్ట‌కేల‌కు రామ్ స్పందించ‌డంతో ఆ వార్త‌ల్లో నిజం లేద‌ని తేలిపోయింది. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. రామ్ ప్ర‌స్తుతం 'ది వారియ‌ర్' చిత్రంలో న‌టిస్తున్నాడు. లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో రామ్ స‌ర‌స‌న కృతిశెట్టి న‌టిస్తోంది. ఈ చిత్రం త‌రువాత రామ్.. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో ఓచిత్రంలో న‌టించ‌నున్నాడు.

Next Story