అభిమాని కుటుంబానికి అండగా హీరో ప్రభాస్
Hero Prabhas who stood by the fan family. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మంచి మనసును చాటుకున్నారు. ఇటీవల మృతి చెందిన అభిమాని కుటుంబానికి అండగా
By అంజి Published on 15 March 2022 10:07 AM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మంచి మనసును చాటుకున్నారు. ఇటీవల మృతి చెందిన అభిమాని కుటుంబానికి అండగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే.. రాధేశ్యామ్ సినిమా విడుదల సందర్భంగా గత గురువారం రాత్రి కారంపూడిలోని ఐమ్యాక్స్ థియేటర్ దగ్గర ప్రభాస్ 30 అడుగుల బ్యానర్ కడుతుండగా ప్రమాదం జరిగింది. 37 ఏళ్ల చల్లా కోటేశ్వరరావు ప్రభాస్‌కు పెద్ద ఫ్యాన్. సినిమా విడుదల సందర్భంగా ఫ్లెక్సీ కడుతుండగా , అది కాస్తా కరెంట్ తీగలపై పడింది. దీంతో ఫ్లెక్సీని పట్టుకుని ఉన్న కోటేశ్వరరావు కరెంట్ షాక్‌కు గురై తీవ్ర గాయాలపాలై మృతి చెందాడు. హీరో ప్రభాస్ ఎమోషనల్ పర్సన్ అన్న విషయం తెలిసిందే. ఈ ఘటన గురించి తెలిసిన ప్రభాస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కారంపూడి మండల అభిమాన సంఘం నాయకుడు చల్లా అనిల్.. జరిగిన ప్రమాదం గురించి ప్రభాస్ తెలియజేశాడు. దీంతో స్పందించిన ప్రభాస్ అభిమాని కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించారు. పెదకోటేశ్వరరావు భార్య పిచ్చమ్మకు, తల్లిదండ్రులకు చెక్కును అందించారు.
రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ప్రేమకథా చిత్రం రాధే శ్యామ్. ఈ చిత్రంలో ప్రభాస్ హస్తసాముద్రికుడైన విక్రమాదిత్యగా, పూజా హెగ్డే డాక్టర్ ప్రేరణగా నటించారు. యువి క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం కరోనావైరస్ మహమ్మారి కారణంగా చాలాసార్లు వాయిదా వేయవలసి వచ్చింది. రాధే శ్యామ్ విమర్శకుల నుండి, ప్రేక్షకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకుంటుంది. సినిమా గ్రాండియర్‌ని అందరూ మెచ్చుకోగా.. కథనం బాగా లేకపోవడంపై పలువురు అభిప్రాయపడ్డారు.