మీడియాకు దూరంగా ప్రభాస్.. ఎందుకంటే..?
ప్రస్తుతం ఆదిపురుష్ సినిమా మేనియా నడుస్తూ ఉంది. ఈ భారీ సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 Jun 2023 5:38 AM GMTమీడియాకు దూరంగా ప్రభాస్.. ఎందుకంటే..?
ప్రస్తుతం ఆదిపురుష్ సినిమా మేనియా నడుస్తూ ఉంది. ఈ భారీ సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ మూవీ ని భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఓపినింగ్స్ భారీగా ఉండబోతున్నట్లు తెలుస్తున్నా.. సినిమా ప్రమోషన్స్ పెద్దగా జరగడం లేదు. తెలుగులో కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో చేసి.. ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. గతంలో ప్రభాస్ ..తన చిత్రాలు సాహో, రాధేశ్యామ్ చిత్రాల రిలీజ్ టైమ్ లో చాలా ఇంటర్వూలు ఇచ్చారు. ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడటం తప్పించి , ప్రభాస్ ఈ సినిమా గురించి ఏ మీడియాకూ ఇంటర్వూ ఇవ్వలేదు. ఆదిపురుష్ కి తిరుపతిలో ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా చేశారు. మిగతా టీమ్ ముంబై లో ఇంటర్వూస్ ఇస్తూ ఆదిపురుష్ ని ప్రమోట్ చేస్తుంది.
కానీ ఇప్పటివరకు తెలుగులో ఓ ప్రెస్ మీట్ కానీ, మీడియా ఇంటరాక్షన్ కానీ ఇవ్వలేదు. ప్రభాస్ దూరంగా ఉంటున్నాడు. హైదరాబాద్ లో ట్రైలర్ రిలీజ్ లో అభిమానులకి కనిపించిన ప్రభాస్ ఆపై ఆదిపురుష్ ప్రమోషన్స్ లో కనబడలేదు. భారీ సినిమాకు ఇంత వీక్ ప్రమోషన్స్ అంటూ ప్రభాస్ ఫాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఈ చిత్రం రామాయణం ఆధారంగా చేసారు కాబట్టి ప్రత్యేకంగా రాముడుకి ప్రమోషన్స్ వద్దని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారట. తమ సినిమా అద్బుతంగా వచ్చిందని , రిలీజ్ అయ్యిన వెంటనే మౌత్ టాక్ సరిపోతుందని భావిస్తూ ఉన్నారు. అయితే హనుమంతుడికి ప్రత్యేకంగా ఒక సీట్, పలువురు ప్రముఖులు ఉచితంగా టికెట్ల పంపకం, భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ వంటి కారణాల వలన ఆదిపురుష్ వార్తల్లో నిలుస్తూనే వుంది. అభిమానులకు సినిమా రిలీజ్ కు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు రీచ్ అయిపోతూ ఉండడం కూడా ప్లస్ కావడంతో మీడియాకు దూరంగా ఉండడమే మంచిదని ప్రభాస్ అండ్ కో కూడా భావిస్తూ ఉన్నారు.
ఇక ప్రభాస్ యూఎస్ వెళ్లిపోయాడని అంటున్నారు. ఈ సినిమాను ఆయన అక్కడే చూస్తాడని చెబుతున్నారు. ఈ సినిమా బుకింగ్స్ రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. ప్రేక్షకుల అంచనాలకు తగినట్టుగా ఉంటే, సంచలనానికి తెరతీయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు గుడ్‌న్యూస్ చెప్పాయి, అదేమంటే ఈ సినిమా టికెట్ రేట్లు పెంచి అమ్ముకోవడానికి అనుమతి ఇచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం ‘ఆదిపురుష్’ టికెట్ ధరల పెంపునకు ముందుగా అనుమతి ఇచ్చింది. ఒక జీవో విడుదల చేయగా ఆ జీవో ప్రకారం సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌పై రూ. 50 పెంచి అమ్ముకునే అవకాశం ఇచ్చింది. అయితే మొదటి మూడు రోజులు మాత్రమే ఈ పెంపునకు అనుమతి ఇస్తున్నట్లు ఉత్తర్వులలో పేర్కొంది. ఇక మూడు రోజుల పాటు రోజుకు ఆరు షోలకూ అనుమతి ఇచ్చింది టీ సర్కార్. ఆ లెక్కన తెల్లవారుజామున 4 గంటల నుంచి ఆదిపురుష్ చిత్రాన్ని థియేటర్లలో ప్రదర్శించవచ్చని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా టికెట్ ధరపై రూ. 50 పెంచినట్లు ఒక జీవో జారీ చేసింది. ఇక ఏపీలో పదిరోజులు పెంచిన టికెట్ రేట్లు అమ్ముకోవచ్చని జారీ చేసిన జీవోలో పేర్కొన్నారు. అయితే స్పెషల్ షోకు మాత్రం అనుమతి ఇవ్వలేదు.