'కల్కి' రిలీజ్ డేట్ ఫిక్స్.. పూనకాల్లో ప్రభాస్ ఫ్యాన్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న 'కల్కి 2898AD'మూవీ ఈ ఏడాది మే 9వ తేదీన విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
By అంజి Published on 12 Jan 2024 12:00 PM IST'కల్కి' రిలీజ్ డేట్ ఫిక్స్.. పూనకాల్లో ప్రభాస్ ఫ్యాన్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న 'కల్కి 2898AD'మూవీ ఈ ఏడాది మే 9వ తేదీన విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు వీడియో గ్లింప్స్, రిలీజ్ డేట్‌ని సంక్రాంతి సినిమాలు ఆడుతున్న థియేటర్లలో అనౌన్స్ చేశారు. దీంతో ఈ మూవీ ముందుగా ఊహించినట్లే ఈ ఏడాది మే 9వ తేదీన రాబోతోంది. "ది ఎండ్ బిగిన్స్ నౌ" అంటూ కల్కి 2898 ఏడీ రిలీజ్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. టైటిల్లోని 2898 నంబర్లు అటూ ఇటూ వెళ్తూ చివరికి 2024 దగ్గర ఆగిపోయాయి. తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఇస్తాడు. ఆ పక్కనే మే 9వ తేదీ రిలీజ్ అంటూ సర్‌ప్రైజ్ చేశారు. వైజయంతీ మూవీస్‌కు బాగా కలిసొచ్చిన మే 9వ తేదీనే ఈ మూవీ రిలీజ్ చేస్తారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి.
చివరికి అదే నిజమైంది. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశాపటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ కల్కి 2898 ఏడీ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు వీఎఫ్ఎక్స్ కోసమే భారీగా ఖర్చు చేశారు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కల్కి 2898 ఏడీ మూవీ అధికారిక ఎక్స్ అకౌంట్లో చేసిన ట్వీట్ కూడా వైరల్ అవుతోంది. ఈ మూవీ సర్‌ప్రైజ్ త్వరలోనే రానుందని.. అది మొదట చూసిన వాళ్లను తమను ట్యాగ్ చేసి ప్రపంచానికి ఆ సర్ ప్రైజ్ ఏంటో చెప్పాలంటూ మేకర్స్ ట్వీట్ చేశారు. ఆ సర్‌ప్రైజ్ ఈ రిలీజ్ డేట్ తోపాటు టీజర్ లాంటిది ఏమైనా ఉండొచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు.