డార్లింగ్ పర్సనల్ లైఫ్ లోకి కూడా తొంగిచూశారు.. చివరికి తేలింది ఏమిటంటే?

బాహుబలి స్టార్ ప్రభాస్ భారతీయ సినిమా పరిశ్రమలో అతిపెద్ద సినిమా స్టార్లలో ఒకరు. ప్రభాస్ సినిమాల గురించి మాత్రమే కాదు అతని వ్యక్తిగత జీవితం కూడా అభిమానులలో చర్చనీయాంశమే.

By అంజి  Published on  18 May 2024 9:00 AM IST
Hero Prabhas, instagram story, Tollywood, Kalki

డార్లింగ్ పర్సనల్ లైఫ్ లోకి కూడా తొంగిచూశారు.. చివరికి తేలింది ఏమిటంటే? 

బాహుబలి స్టార్ ప్రభాస్ భారతీయ సినిమా పరిశ్రమలో అతిపెద్ద సినిమా స్టార్లలో ఒకరు. ప్రభాస్ సినిమాల గురించి మాత్రమే కాదు అతని వ్యక్తిగత జీవితం కూడా అభిమానులలో చర్చనీయాంశమే. ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు. ఇక ప్రభాస్ పెళ్లి గురించి ఇంటర్నెట్‌లో అనేక వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అతను ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో అభిమానులకు ఎటువంటి క్లూ లేనప్పటికీ.. ఇటీవల ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆశ్చర్యకరమైన స్టోరీ పెట్టాడు. “డార్లింగ్స్ ! ఎట్టకేలకు, మన జీవితంలోకి ప్రత్యేకమైన వాళ్లు ప్రవేశించబోతున్నారు. వెయిట్ చెయ్యండి” అని రాసుకొచ్చారు.

ఇక అంతే కొందరు ఏకంగా ప్రభాస్ పెళ్లి ప్రకటన రాబోతోందంటూ ఊదరగొట్టారు. గతంలో ప్రభాస్ మీద వచ్చిన రూమర్స్ అన్నిటినీ గెలికేశారు. ప్రభాస్ కుటుంబ సభ్యులు ప్రభాస్ పెళ్లి గురించి ఇంతకు ముందు చేసిన ప్రకటనలన్నీ వైరల్ చేసేశారు. ప్రభాస్ పర్సనల్ లైఫ్ లోకి తొంగి చూసి విశ్లేషణలను అందించారు. చివరికి ప్రభాస్ తన సినిమా ప్రమోషన్ గురించి ఈ పోస్టు పెట్టాడు. ప్రభాస్-దీపికా పదుకోన్ కాంబినేషన్ లో కల్కి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ ను పంచుకున్నాడు ప్రభాస్. 'మీట్ మై బుజ్జి' అంటూ ఓ టైర్ కు సంబంధించిన పోస్టును పెట్టారు. మే 18వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఇందుకు సంబంధించిన ప్రోమో ఉంటుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో ప్రభాస్ పెళ్లి గురించి కాదని స్పష్టమైంది. ఏది ఏమైనా కొందరు మరీ అతిగా ప్రవర్తించారని ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు.

Next Story