నిఖిల్ స్వయంభు యుద్ధానికి ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా?
మంచి కథలు ఉండే సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడంతో నిఖిల్ సక్సెస్ అయ్యాడు.
By అంజి Published on 8 May 2024 2:30 PM GMTనిఖిల్ స్వయంభు యుద్ధానికి ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా?
మంచి కథలు ఉండే సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడంతో నిఖిల్ సక్సెస్ అయ్యాడు. కార్తికేయ 2 బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత నిఖిల్ మరో కొత్త తరహా సినిమాపై దృష్టి పెట్టాడు. భరత్ కృష్ణమాచారి రచన, దర్శకత్వం వహిస్తున్న 'స్వయంభూ' సినిమాలో హీరోగా కనిపించనున్నాడు. ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ఫీచర్‌లో నిఖిల్ హనుమాన్ భక్తుడిగా నటిస్తూ ఉండగా నిఖిల్ సరసన సంయుక్త మీనన్ కనిపించనుంది.
ప్రస్తుతం టీమ్ ప్రముఖ తారాగణంతో ఎపిక్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తోంది. వియత్నామీస్ ఫైటర్స్‌తో సహా 700 మంది ఆర్టిస్టులతో 12 రోజుల పాటు వార్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తూ ఉన్నారు. ఇందులో నిఖిల్ కొన్ని అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్స్ లో భాగమయ్యాడు. దీనికోసం మేకర్స్ ఏకంగా రూ.8 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ సినిమాలో వారియర్ గా కనిపిస్తున్న నిఖిల్.. అందుకు తగినట్లుగా షూటింగ్ ప్రారంభానికి ముందే శిక్షణ తీసుకున్నాడు.
రెండు భారీ సెట్లలో ప్రతిష్ఠాత్మకంగా వార్ సీక్వెన్స్ చిత్రీకరించారు. ఈ ఏడాది చివర్లో సినిమా విడుదల కానుంది. సినిమాకి సంబంధించిన మేజర్ హైలైట్స్‌లో ఇదొకటి కానుంది. KGF సిరీస్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. మనోజ్ పరమహంస కెమెరాను హ్యాండిల్ చేస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది. నిఖిల్ మరోసారి కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.