హీరో నిఖిల్‌ ఇంట తీవ్ర విషాదం

Hero Nikhil Father Shyam Siddhartha passed away.టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 April 2022 3:52 PM IST
హీరో నిఖిల్‌ ఇంట తీవ్ర విషాదం

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నిఖిల్ తండ్రి కావలి శ్యామ్ సిద్ధార్థ్ క‌న్నుమూశారు. గ‌త కొద్ది రోజులు అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా.. నేడు(గురువారం) ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఆయ‌న తుది శ్వాస విడిచారు. దీంతో నిఖిల్ ఇంట్లో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. కాగా.. శ్యామ్ సిద్ధార్థ్ మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. శ్యామ్ సిద్దార్థ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. నిఖిల్ ప్ర‌స్తుతం'కార్తికేయ 2', '18 పేజెస్' చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే 'స్పై' టైటిల్ తో ఇటీవల ఓ పాన్ ఇండియా మూవీ ప్రకటించారు. కెరీర్ పరంగా స‌క్సెస్ ట్రాక్‌లో దూసుకుపోతున్న ఈ త‌రుణంలో తండ్రి మ‌ర‌ణం నిఖిల్ కు పెద్ద షాకే.

Next Story