తెలుగు రాష్ట్రాల్లో నాని 'హిట్-3' టికెట్ల ధరలివే!!

నాని నటించిన హిట్ 3 సినిమా మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. సెన్సార్ ఫార్మాలిటీలు కూడా పూర్తయ్యాయి.

By అంజి
Published on : 28 April 2025 2:00 PM IST

Hero Nani, Hit 3 movie, ticket prices, Telugu states, Tollywood

తెలుగు రాష్ట్రాల్లో నాని 'హిట్-3' టికెట్ల ధరలివే!! 

నాని నటించిన హిట్ 3 సినిమా మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. సెన్సార్ ఫార్మాలిటీలు కూడా పూర్తయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా టిక్కెట్ల రేట్లు ఖరారయ్యాయి. తెలంగాణలో ఈ సినిమా సింగిల్ స్క్రీన్లలో ₹175 కాగా మల్టీప్లెక్స్లలో ₹295 ధరను నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ సినిమా సింగిల్ స్క్రీన్లలో ₹200, మల్టీప్లెక్స్లలో ₹250 ధరను నిర్ణయించింది.

హిట్ 3 సినిమాకు A సర్టిఫికెట్‌ జారీ చేశారు. సినిమా నిడివి 157 నిమిషాలు. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌లు కూడా బాగా ప్రారంభమయ్యాయి. అమెరికాలో ప్రీమియర్ ప్రీ-సేల్స్ కూడా $200K మార్కును దాటాయి. టాలీవుడ్‌లో ప్రస్తుతం థియేటర్ల కలెక్షన్స్ బాగా తగ్గిపోయాయి. ఏప్రిల్ నెలలో ఒక్క సాలిడ్ హిట్ కూడా నమోదవ్వలేదు. ఈ సమయంలో హిట్ 3 బ్లాక్‌బస్టర్‌గా మారుతుందని ఎగ్జిబిటర్లు భావిస్తున్నారు.

Next Story