రేపే 'కస్టడీ' రిలీజ్.. అప్పుడే లాభాల బాట అంటున్నారే..?

నాగ చైతన్య హీరోగా నటించిన 'కస్టడీ' సినిమా మే 12న విడుదల కాబోతోంది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు ఈ సినిమాకి దర్శకత్వం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 May 2023 11:30 AM GMT
Hero Naga Chaitanya, Custody movie, Tollywood, Venkat Prabhu

రేపే 'కస్టడీ' రిలీజ్.. అప్పుడే లాభాల బాట అంటున్నారే..?

నాగ చైతన్య హీరోగా నటించిన 'కస్టడీ' సినిమా మే 12న విడుదల కాబోతోంది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. తెలుగుతో పాటు తమిళంలోను అదే రోజున ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. విలన్ ను కాపాడే పోలీసు పాత్రలో చైతూ ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టిందని అంటున్నారు. ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనే సినిమా లాభాల్లోకి వెళ్ళిపోయింది. ఇక హిట్ టాక్ వస్తే మాత్రం చిత్రం భారీ సక్సెస్ ను అందుకోనుంది. తెలుగు రాష్ట్రాల్లో 18 కోట్లు, ఇతర ప్రాంతాల్లో మరో మూడు కోట్లు సహా ఈ సినిమా దాదాపు 23 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కోటి రూపాయలు వస్తే బ్రేక్ ఈవెన్‌ సాధిస్తుందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఓటీటీ, ఇతర హక్కులను లెక్కలోకి తీసుకుంటే ఈ చిత్రం ఇప్పటికే లాభాల్లోకి వచ్చేసిందని అంటున్నారు. తక్కువ బడ్జెట్ తో ‘కస్టడీ’ సినిమా చేయడంతో నిర్మాతలకు లాభం తెచ్చిపెట్టడం ఖాయం అంటున్నారు.

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాలో, చైతూ జోడీగా కృతి శెట్టి కనిపించనుంది. సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా, U/A సర్టిఫికేట్ ను దక్కించుకుంది. ఈ సినిమా రన్ టైం 147 నిమిషాలు (2 గంటల 27 నిమిషాలు) ఉంటుందని సమాచారం. అరవింద్ స్వామి విలన్ గా నటించారు. ప్రియమణి, శరత్ కుమార్, సంపత్ రాజ్, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ కీలక పాత్రలు పోషించారు. తెలుగు-తమిళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవ్వనుంది.

Next Story